- Advertisement -

రేవంత్ రెడ్డి..చంద్రబాబు మనిషే!

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, అహంకారం తగ్గించుకోవాలని హెచ్చరించారు.

“మేము కష్టపడితేనే నువ్వు సీఎం అయ్యావు.. అది నీ అదృష్టం” అంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీకు నువ్వే పదేళ్లు సీఎం అంటావా? అది రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని అవమానించడమే” అని విమర్శించారు. ఇది టీడీపీ కాంగ్రెస్‌నా? లేక రాహుల్ కాంగ్రెస్‌నా? మళ్లీ ఎవరి మద్దతుతో సీఎం అవుతావు? అంటూ ప్రశ్నించారు.

140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో రేవంత్ లాంటి అహంకారంతో మాట్లాడే సీఎంని చూడలేదని ఆయన అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మంత్రులు, పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. “వినాశకాలే విపరీత బుద్ధి” అనే సామెత రేవంత్ మాటలు విన్నప్పుడల్లా గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్రా నేతల పెత్తనం నడుస్తోందని, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్‌గా సీఎం పదవికే పోటీ చేస్తానంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -