- Advertisement -

తిరుపతి..11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

- Advertisement -

తిరుపతిలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు తిరుచానూరు పోలీసులు. ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో రెండో వివాహం చేసుకుంది ఓ మహిళ.

స‌ద‌రు మ‌హిళ‌కు మొద‌టి భ‌ర్త‌తో జ‌న్మించింది బాలిక (11). ఇంటిలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్సలు నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో తిరుచానూరు పోలీసులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -