మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారి పొడవునా వైయస్ జగన్ కి స్వాగతం పలికారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు. అలాగే లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగన్.
ఇప్పట్ల గ్రామంలో ఇటీవల నూతనంగా వివాహం చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు దివంగత పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అమృత రెడ్డి లను ఆశీర్వదించారు జగన్.
