- Advertisement -

తండ్రీ , కొడుకుల సేఫ్ జోన్ కోసం భూమా ఫ్యామిలిని ఫనంగా పెట్ట‌నున్నారా….?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు దేశంలో అంత‌గా తెలియ‌ని నంద్యాల నియేజ‌క వ‌ర్గం ఉప ఎన్నిక‌లో నంద్యాల‌పేరు మారు మ్రోగింది. ఎందుకంటె ఏకంగా సీఎం బాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకుంటె మొత్తం మంత్రి వ‌ర్గం అంతా రెండు నెల‌ల‌పాటు నంద్యాల‌లోనె మోహ‌రించారు. దాంతో నంద్యాల పేరు ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. అయితె ఇప్పుడు మ‌రో సారి అలాంటి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అదెలాగ‌నుకుంటున్నారా…?

2019 ఎన్నిక‌లు కురుక్షేత్ర మ‌హాసంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. అవి ఎన్నిక‌లు కాదు. పొలిటిక‌ల్ వార్‌. ఎన్నిక‌ల స‌మ‌యానికి విచిత్ర‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని నియేజ‌క‌వ‌ర్గాల సీట్లు తార‌మారు అవ‌నున్నాయి. త‌న కొడుకును వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో గెలిపించ‌డంకోసం అన్ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు చంద్ర‌బాబు.

ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో లోకేష్ గెల‌వ‌లేడ‌న్న సంగ‌తి బాబుతోపాటు అంద‌రికి తెలిసిదే. అందుకే సేఫ్‌జోన్‌ను వెతికి పెట్టారు. అ నియేజ‌వ‌ర్గం ఏదో కాదండోయ్‌.. చంద్ర‌బాబు సొంత నియేజ‌క వ‌ర్గం కుప్పం నుంచి పోటీచేయ‌నున్నారు. కొడుకుకోసం త‌న నియేజ‌క వ‌ర్గాన్ని త్యాగం చేసిన బాబు కూడా సేఫ్ జోన్ నంద్యాల నియేజ‌క వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. తండ్రీ, కొడుకుల సేఫ్ కోసం భూమా వర్గాన్ని ప‌నంగా పెట్టార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

నంద్యాల రాజ‌కీయాల‌లో భూమా కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఝుల‌క్ ఇవ్వ‌నున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక‌లో గెల‌వాలి కాబ‌ట్టి అప్ప‌ట్లో భూమా ఫ్యామిలీకి ప్ర‌యారిటి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక అవ‌స‌రం తీరిపోయింది.

మొన్న ఉప ఎన్నిక‌లో గెలిచిన భూమా బ్రహ్మానంద‌రెడ్డి పరిస్థితే ఎందుకూ కొరగాకుండా పోతుంది. అత్యంత భారీగా ఖర్చు చేసి బ్రహ్మానంద రెడ్డి అక్కడ నుంచి విజయం సాధించాడు. మరి అదంతా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. తను పోటీ చేయడం ద్వారా బ్రహ్మానంద రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వకుండా బాబు చెక్ చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఇచ్చి తొక్కేయడం చంద్రబాబు కు కొత్త ఏమీ కాదు. ఇలాంటి కరివేపాకుల జాబితాను తయారు చేస్తే చాలా పెద్దదే అవుతుంది. రాజ‌కీయంగా అవ‌స‌రానికి వాడుకోవ‌డం…. అవ‌స‌రం తీరాక తొక్కేయడం బాబుకు వెన్న‌తో పెట్టిని విద్య‌.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి భూమా ఫ్యామిలీ, వ‌ర్గం కొత్త నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అఖిల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం,ఉప ఎన్నిక‌లో ఆకుటుంబానికె టికెట్ ఇవ్వ‌డం చూస్తె అళ్ల‌గ‌డ్డ‌కే భూమా ఫ్యామిలీని ప‌రిమితం చేయనున్నార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితె భూమా ఫ్యామిలీ బాబుకు చుక్క‌లు చూపించేందుకు రెడీ అవుతున్నార‌నె వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

భూమా ఫ్యామిలీకి చెక్ పెడితె అళ్ల‌గ‌డ్డ‌నియేజ‌క వ‌ర్గానికె ప‌రిమితం అవ్వాలి లేకుంటె పార్టీ మార‌డం మిన‌హా మ‌రోక దారి లేదు. ఒక వేల వైసీపీలోకి వెల్లినా వారికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండ‌దు. ఎందుకంటె ఇప్ప‌టికె నంద్యాల‌, శ్రీశైలం రెండు నియేజ‌క వ‌ర్గాల‌లో శిల్పా బ్ర‌ద‌ర్స్ పోటీ చేయ‌నున్నారు.

ఇక భూమా ఫ్యామిలీకి మిగిలింది ఒక‌టే ఆఫ్స‌న్‌. అది జ‌న‌సేన పార్టీ. ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించ‌న‌పుడు భూమా ఫ్యామిలీ కీల‌క పాత్ర పోషించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి . ఈ స‌స్సంబంధాల కార‌ణంగా 2019 ఎన్నిక‌ల నాటికి టీడీపీ మొండిచేయి చూపితె …. ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో చేర‌డం త‌ప్ప మ‌రో మార్గంలేదు. దీన్ని బ‌ట్టి చూస్తె భూమా వారసులకు రెండో అవకాశం లేకుండా చేస్తున్నాడని స్పష్టం అవుతోంది. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్ రాజ‌కీయం కోసం జ‌న‌సేన లోకి వెల్తున్నార‌నె ప్ర‌చారం జోరందుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -