Friday, May 3, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మపై రాక్షస రాతలు, జగన్‌ని రాక్షసుడిగా చూపడం, బాబు భజన….. ఇదీ ఈనాటి రాధాకృష్ణ జర్నలిజం

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తానన్న తర్వాత నుంచీ టిడిపి అండ్ ఆ పార్టీ భజన మీడియా మొత్తం రామ్ గోపాల్ వర్మపై ఏ స్థాయి కసితో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో నిజాలు లేకపోతే జనాలే తిప్పికొడతారు అన్న చంద్రబాబు విమర్శను అదే స్థాయిలో తిప్పి కొడుతూ నా సినిమాలో ఇంతవరకూ జనాలకు తెలియని నిజాలే ఉంటాయి, నిజాలే చూపిస్తా చంద్రబాబూ అని రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుపై సెటైర్ వేయడంతో అందరిలోనూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కాకపోతే తెగబడి మాట్లాడే రకం కాదు కాబట్టి జగన్‌ని కార్నర్ చేయగలుగుతున్నారు కానీ రామ్ గోపాల్ వర్మను కార్నర్ చేయగలరా? వర్మ తెగబడి తిరగబడితే చంద్రబాబుతో సహా ఎల్లో మీడియా జనాలందరినీ కమెడియన్లను చేసి దేవతా వస్త్రాలను తప్పించి అసలు నిజాలు జనాలకు తెలియచేయడానికి ఎంతో సేపు పట్టదు. వర్మ నాలెడ్జ్ లెవెల్స్ ఆ స్థాయిలో ఉంటాయి. కొన్ని ట్వీట్స్ సిల్లీగా అనిపించినా వర్మ స్థాయి నాలెడ్జ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మీడియాలో కానీ పాలిటిక్స్‌లో కానీ చాలా తక్కువ మంది ఉన్నారన్నది నిజం. అది కూడా తనకు అనిపించిన విషయాలను స్వార్థం కోసమో, స్వలాభం కోసమో చూసుకోకుండా క్రేజీగా కామెంట్స్ చేయడానికి వర్మ ఎప్పుడూ వెనుకాడడు. అందుకు భయపడి కాస్త జాగ్రత్తగా ఉన్నారు కానీ వర్మపై ఆ బ్యాచ అందరికీ ఏ స్థాయిలో కోపం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ కోపం మొత్తం ఈ రోజు ఆంద్రజ్యోతి పత్రికలో కనిపంచింది. ఇవాంక విజిట్, జీఈఎస్ మీట్ సూపర్ సక్సెస్ అవడాన్ని…… మరీ ముఖ్యంగా బాబు స్థాయిని తగ్గిస్తూ కెసీఆర్ స్థాయిని పెంచినవైనాన్ని ఎల్లో మీడియా జనాలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అందుకే ఇవాంకను, కెసీఆర్‌ని ఎవరైనా తిడతారా అని ఎదురుచూస్తున్నారు. అలా ఎవరైనా తిడితే ఆ తిట్లను ప్రచారం చేసి కెసీఆర్ ఇమేజ్‌ని కాస్త తగ్గించి బాబు ఇమేజ్ మరీ డౌన్ అవకుండా చేద్దామనేది ఐడియా. సొంతంగా విమర్శించే ధైర్యం ఇప్పుడు ఎలాగూ లేదులే. అందుకే ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలను అడ్డుపెట్టుకుని ఇష్యూ చేద్దామనేది ఆలోచన. చాలా ఎక్కువ విషయాలపైన స్పందిస్తూ ఉంటాడు కాబట్టి…… అలాగే వర్మ మాటలకు ఇష్యూ చేసే స్థాయి ఉందని మీడియా ఫీలవుతూ ఉంది కాబట్టి వర్మ విమర్శల కోసం ఎధురుచూశారు. కానీ నాగార్జునతో చేస్తున్న సినిమా విషయంలో బిజీగా ఉన్న వర్మ ఇవాంక విజిట్‌పై మళ్ళీ స్పందించలేదు. అలా స్పందించకపోవడం, కెసీఆర్‌ని విమర్శించకపోవడమే ఆంధ్రజ్యోతికి కోపం తెచ్చింది. అందుకే తన ఆగ్రహం మొత్తం వెల్లగక్కుతూ మరీ ఛీప్‌గా ఓ న్యూస్ ప్రచురించింది. ‘వర్మ ఉన్నాడా? లేడా? ’ అని రాసే స్థాయికి దిగజారి వార్తను ప్రచురించారు. వర్మను హౌస్ అరెస్ట్ చేశారా? వర్మ నుంచి ఫోన్ లాక్కున్నారా? అని రాశారు. వర్మ నుంచి కచ్చితంగా ఏదో ఒక స్పందన రావాల్సిందేనట. లేకపోతే ఇవాంక వస్తుందని హైదరాబాద్‌లో బిచ్చగాళ్ళను ఏరేసినట్టుగా వర్మను కూడా ఏరేసి ఉంటారని భావించాల్సి వస్తుందని రాసుకొచ్చారు. హవ్వ……..ఇదా జర్నలిజం? ఏం జర్నలిజం ఇది. రాతలో జర్నలిజం కంటే రాక్షస స్థాయి శాడిజమే ఎక్కువ కనిపిసించడం లేదా?

ఈ వార్త విషయం పక్కన పెడితే చదువుకునే పిల్లలందరి చదువునూ జగన్ చెడగొడుతున్నాడని, వాళ్ళ చదువులు పాడైపోతే వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలని, సమాజం ఏమైపోతుందని ఆవేధన వ్యక్తం చేస్తూ ఒక వార్త వండారు. ఎవరో ఎల్లయ్య ఏదో చెప్పాడని పేరు లేకుండా వార్త రాసి జగన్‌ని విద్యార్థుల చదువులు చెడగొట్టే రాక్షసుడిగా చిత్రీకరించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆ తర్వాత బాబుగారి భజనను మాత్రం ఆకాశమే హద్దు అన్న స్థాయిలో చేశారు. అసెంబ్లీలో బాబుగారు జోకులు వేసి సభ్యుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడట. ఇక విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఆయా విద్యాలయాల యజమానులే బాధ్యత వహించాలని, ఇకపై ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా యాజమాన్యాలను శిక్షిస్తానని హూంకరించాడట బాబుగారు. ఈ మాటను నారాయణ విద్యాసంస్థల యజమాని, బాబుగారి కేబినెట్ మంత్రి అయిన నారాయణను పక్కన పెట్టుకుని చెప్పాడా లేదా అన్న విషయం మాత్రం చెప్పలేదు. మంత్రిగారు కాబట్టి ఆయన కూడా అసెంబ్లీలో ఉండే ఉంటారు. ఇకపైన జరిగే ఆత్మహత్యలకు శిక్షలు ఒకే. మరి ఇప్పటి వరకూ నారాయణ కాలేజీల్లో జరిగిన విద్యార్థి ఆత్మహత్యలకు బాధ్యుడిని చేస్తూ 2014 నుంచీ చంద్రబాబుకు మెయిన్ స్పాన్సరర్, నారాయణ విద్యాసంస్థల యజమాని, చంద్రబాబు మంత్రివర్గ సహచరుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యుడి లాంటి బంధువు అయిన నారాయణను శిక్షించేది ఉందా? లేదా అనే విషయం మాత్రం చెప్పలేదు. చెప్పలేడు కూడా. మరి ఎందుకు ఈ హూంకరింపులు? ఏదో ఒకటి చేస్తున్నట్టు కనిపించకపోయినా….చెప్తున్నట్టు అయినా జనాలకు కనిపించాలి కదా……అందుకన్నమాట.

ఇక పోలవరం అనుమతుల విషయంలో కేంద్రంగా దారుణంగా వ్యవహరిస్తోంది అని ఇంకో వార్తను కూడా ప్రచురించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, వైఎస్‌తో సహా అందరినీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకాని, అనుమతులు తెచ్చుకోలేని అసమర్థులు అని ఇదే ఎల్లో మీడియా ఎన్నో సార్లు వార్తలు రాసింది. కానీ ఇప్పుడు మాత్రం వెరైటీగా అనుమతులు ఇవ్వకుండా,సాయం చేయకుండా బాబుగారిని బాధపెడుతున్నారని…..బాబుగారు మాత్రం అహర్నిశలూ కష్టపడుతున్నారని……అందరూ బాబుగారిపైన సానుభూతి చూపించాలని రాస్తున్నారు. ఎందుకు ఈ తేడా? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అసమర్థులు అయితే చంద్రబాబు అంతకుమించిన అసమర్థుడు కాడా? ఎందుకంటే వాళ్ళు పదవి ఇచ్చిన అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాలి? అలా మాట్లాడితే పదవి కూడా పోతుందనడంలో సందేహం లేదు. బాబుగారికి ఆ సమస్య లేదుగా. పదవికి వచ్చిన ఢోకా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్యంగా ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి అదనంగా దక్కుతున్నది కూడా ఏమీ లేదు. ఆ విషయాన్ని చంద్రబాబే చాలా సార్లు బీద అరుపులు అరుస్తూ చెప్తూ ఉంటాడు. బయటికి వచ్చినంత మాత్రాన రాష్ట్రానికి అయితే ఎలాంటి నష్టం లేదు. కాకపోతే బాబుపైన కోపంతో బాబుపైన ఉన్న కేసులను తిరగదోడి బుక్ చెయ్యొచ్చు. బాబుపై కోపంతో జగన్‌ని చేరదీసి ఆయన పైన కేసులు ఎత్తేయించవచ్చు. అంతకుమించి మూడున్నరేళ్ళుగా నయాపైసా సాయం చేయని కేంద్రప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉండడం వళ్ళ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. ఇకపై ఒరగబోయేది ఏమీ లేదు. ప్రయోజనాలన్నీ కూడా చంద్రబాబు వ్యక్తిగతానికి సంబంధించినవే. అయినప్పటికీ ఎల్లో మీడియాకు మాత్రం నిజాలు కనిపించవు. బాబుగారి భజనలో తరిస్తూ ఉంటాయి. జగన్‌తో సహా బాబుగారి వ్యతిరేకులను రాక్షసులుగా చిత్రించే ప్రయత్నం చేస్తుంటాయి. మళ్ళీ ఇంతోటి జర్నలిజాన్ని ప్రజల కోసం నిబద్ధ ప్రయాణం అని …….ఇంకోటని చెప్తూ భారీ భారీ పదాలతో స్వోత్కర్ష ఒకటి……హతవిధీ….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -