Tuesday, April 30, 2024
- Advertisement -

టిడిపికి బానిసగా మారిపోయి మానవత్వం మరిచిపోయిన పవన్?

- Advertisement -

టిడిపి ప్రభుత్వ వైఫల్యం పుణ్యమాని పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా తన సినిమా షూటింగ్ పనులు చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక దారుణం జరిగిన వెంటనే స్పందించాడు. కానీ ఆ స్పందన అంతా కూడా దారుణానికి ఒడిగట్టిన టిడిపికి సపోర్ట్ చేసేలా ఉంది. టిడిపి నేతల భూ కబ్జాను దళితులు అడ్డుకున్నారు. కోర్ట్‌కు వెళ్ళారు. హైకోర్ట్ తీర్పు దళితులకు అనుకూలంగా వచ్చింది. అయితేనేం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఆ భూములను టిడిపి నేతలకు దక్కేలా చేసి కోర్టు తీర్పుని కూడా అపహాస్యం చేసింది. బాధిత దళితులకు ఇంకేం చేయాలో తెలియలేదు. టిడిపి నేతల భూ కబ్జాను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అంతే అధికారమదంతో కొట్టుకుంటున్న ఆ టిడిపి నేతలకు కోపం వచ్చింది. ఒక దళిత మహిళను బహిరంగంగా వివస్త్రను చేశారు. మనిషైనా ప్రతి ఒక్కడినీ కదిలించే విషయం ఇది. టిడిపి హార్డ్ కోర్ అభిమానులు కూడా ఈ చర్యను సమర్థించరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ కూడా టిడిపికి అనుకూలంగా వ్యవహరించాడు.

జరిగిన దారుణం కెమేరాల్లో రికార్డ్ అయింది. వాళ్ళు టిడిపి నేతలని అందరికీ తెలుసు. కానీ పవన్ మాత్రం టిడిపి నేతలు అవునో కాదో అన్నట్టుగా ట్వీట్ చేశాడు. ఇక ఈ దారుణంపై మీడియా సంయమనం పాటించాలట. సంచలనం చేయకూడదట. ఇలాంటి సంఘటనపై సంచలనం చేయకపోతే ఇక మీడియా ఎందుకు పవన్? ఇలాంటి దారుణమైన సంఘటనకు ఇంకెవ్వరూ పాల్పడకుండా ఉండేలా ప్రజా చైతన్యం వచ్చేలా చేయకపోతే ఇక మీడియా ఎందుకు?

అలాగే పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలకు చెప్పిన సూచనలు కూడా దారుణంగా ఉన్నాయి. వైకాపా లాంటి పార్టీలు ఈ సంఘటనపై విమర్శలు చేయకూడదట. టిడిపి-వైకాపాలు కూర్చుని ఈ సమస్యపై అధ్యయనం చేయాలట. మానవత్వం అని, మనుషులు బాధపడితే చూడలేనని గంటలు గంటలు చెప్పిన పవన్ ఎంతలా మారిపోయాడో చూశారా? ఎంత టిడిపికి బానిస అయితే మాత్రం మరీ ఇలా మాట్లాడాలా? టిడిపి నేతల దాష్టీకంపై వైకాపా-టిడిపిలు ఏం చర్చించాలి? చంద్రబాబునాయుడు అంత గొప్పగా స్పందించే పరిస్థితి ఉంటే అసలు టిడిపి నేతలు ఇంతలా బరితెగిస్తారా? అమాయకంగా ఉన్నావని ప్రజలు అనుకోవాలనుకుంటున్నావేమో పవన్……..కానీ టిడిపి బానిసిగా మారిపోయి నువ్వు ఎంత అమానవీయంగా స్పందిస్తున్నావో ఆ ప్రజలకు సులభంగానే అర్థమవుతోంది. కావాలంటే సోషల్ మీడియాలో నీ ట్వీట్స్‌కి వచ్చిన స్పందన చూడు. అలాగే నీకు కౌంటర్ ఇచ్చిన రోజాకు వస్తున్న స్పందన చూడు. ఎంత రాజకీయం నేర్చుకుంటే మాత్రం…….చంద్రబాబు జేబులో బొమ్మవైతే మాత్రం ఇలాంటి దారుణానికి టిడిపి నేతలు ఒడిగట్టినప్పుడు కూడా మ్యావ్ మ్యావ్ అంటానంటే ఎలా పవన్? చేగువేరా, భగత్ సింగ్ పేర్లను ఉచ్ఛరించే అర్హత ఉంటుందా నీకు? గొప్పగా ఎవరైనా మాట్లాడతారు పవన్……..కానీ గొప్ప మాటలకు హార్డ్ కోర్ అభిమానులు చప్పట్లు కొడతారేమో…….కానీ చేతల్లో నీ చేతగాని తనానికి ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయో నువ్వు యాక్టివ్‌గా ఉండే ట్విట్టర్‌లోనే చూడు. నెటిజనులు ఏ స్థాయిలో స్పందిస్తున్నారో చూడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -