Sunday, May 11, 2025
- Advertisement -

హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ కేసీఆర్….

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటడ్డారు. ఉదయం కరీంనగర్‌లో ఆయన ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్‌‌లో టేకాఫ్‌ కావడానికి కొద్ది సమయం ముందు పొగలు వచ్చాయి. కమ్యూనికేషన్‌ బ్యాటరీ కిట్‌ బ్యాగ్‌ నుంచి పొగలు వస్తున్నట్టుగా గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే దాన్ని దూరంగా తీసుకెళ్లి పడేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. సీఎం కేసీఆర్‌ యథావిధిగా ఆదిలాబాద్‌ జిల్లా ముర్మూర్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

కాగా, ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపానని, కేసీఆర్‌ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్‌ టూర్‌లో సీఎం ఉన్నారని తెలిపారు. ‘చింతించాల్సిన అవసరం లేదు … ఆల్‌ ఇజ్‌ వెల్‌’ అని కేసీఆర్‌ కుమార్తె ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -