ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర, రోజులు పెరిగేకొద్దీ ప్రజల్లో జగన్ పై ఆదరణ కూడా పెరుగుతోంది. యాత్రలో వస్తున్న ప్రజాస్పందనను చూసి ఇతర పార్టీల నాయకులు వైసీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ తీర్థం పుచ్చకున్నారు.
రోజు ఏదో ఒక పార్టీ నుండి కీలక నేతలు పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. జగన్ పశ్చిమ గోదావరిలో అడుగుపెట్టినప్పటి నుండి ఎవరో ఒకరు పార్టీలో జాయిన్ అవుతున్నారు..మొన్న రాలయసీమ మాజీ ఐజి షేక్ మొహమ్మద్ ఇక్బాల్ జాయిన్ అవ్వగా… నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జంగారెడ్డిగూడెంకు చెందిన ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పీపీఎన్ చంద్రరావు జాయిన్ అయ్యారు
తాజాగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.
