- Advertisement -

చిరు, ప‌వ‌న్ భేటీ…రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌…

- Advertisement -

కొన్నాళ్లుగా ఎవరి దారి వారిదేగా ఉంటున్న మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి.. ఒకర్నొకరు కలుసుకోవడం చాలా అరుదుగా మారింది. ప‌వ‌న్ సొంత పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌గా..చిరు సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో హైదరాబాద్‌లో వీరిద్దరూ ఒకచోట ర‌హ‌స్యంగా కలవడం అటు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇటు సినిమా ఇడ‌స్ట్రీలోనూఆసక్తికరంగా మారింది.

మరోవైపు వీళ్లిద్దరి కలయికలో ఏదైనా రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయా అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో పవన్ కళ్యాణ్ కొత్తగా కట్టుకున్న ఇంటి గృహప్రవేశం జరిగితే.. ఆ సందర్భంగా అన్నయ్య చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇద్ద‌రి మ‌ద్య రాజ‌కీయ కోణంలో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గా మెగాఫ్యామిలీలో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసాయి. అందులో పవన్ కళ్యాణ్ తప్పించి మిగిలిన కుటుంబ సభ్యులందరు హాజరయ్యారు. దీంతో ప‌వ‌న్‌పై ప‌లు ర‌కాల ఊహాగానాలు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే.

ఇక చిరుతో వున్న పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు రాజ్య‌స‌భ్య‌త్వం ముగిసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టినుంచి కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ త‌రుపు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని అధిష్టానం కోర‌గా చిరు విముఖ‌త వ్య‌క్తం చేశారు. ఇక ప‌వ‌న్ స్థాపించ‌న జ‌న‌సేన పార్టీలోకి వ‌స్తారా లేకా వెనుక‌నుండి స‌హా స‌హాకార‌లు అందిస్తారా అన్న‌ది చూడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -