Saturday, April 20, 2024
- Advertisement -

జగ్గూ బాయ్.. హ్యాపీ బర్త్ డే టూ యూ!

- Advertisement -

గత మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు జగపతిబాబు. అయితే కెరీర్ బిగినింగ్ లో ఫ్యామిలీ తరహా చిత్రాలు తీసిన ఆయన తర్వాత యాక్షన్, మాఫియా తరహా చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు నట భూషణ శోభన్ బాబు తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో నటించి ఫ్యామిలీ హీరోగా స్టార్ డమ్ దక్కించుకున్నారు.

‘గాయం’, ‘అంత:పురం’ ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘మావిడాకులు’ ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారాయన. ఎన్ని చిత్రాల్లో నటించినా జగపతి బాబు స్టార్ హీరో ఇమేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయారు. ప్రేమికునిగా, ఇంటిపెద్దకొడుకుగా, ఓ మంచిభర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ఆదర్శభావాల నాయకునిగా, న్యాయం కోసం పోరాడే యోధుడుగా ఇలా పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు జగపతిబాబు.

హీరోగా ఎన్ని చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రంలో విలన్ గా నటించి విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి తెలుగు,తమిళ,మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో విలన్ గా నటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగపతిబాబు ఎంతో బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నారు.

నేడు ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఎఫ్.సి.యు.కె.’ విడుదలవుతోంది. అదీ జగపతిబాబు బర్త్ డే కానుకగా రావడం విశేషం. ఆయన హీరోగా సాగుతున్న సమయంలోనూ పుట్టినరోజు కానుకగా సినిమాలు వచ్చినట్టు లేవు. కానీ, ఇప్పుడు కేరెక్టర్ రోల్స్ లో బిజీ బిజీగా సాగుతున్న జగపతిబాబుకు తాజా చిత్రం ఓ గిఫ్ట్ అనే చెప్పాలి.

15 ఏళ్ల చిన్నోడితో ప్రేమ‌.. స‌హ‌జీవ‌నం.. బ్రేక‌ప్ చెప్పేసింది!

బాబుకు మైండ్‌బ్లాంక్ అయ్యింది.. లోకేష్ స‌ర్పంచ్‌గా పోటీ చేయ్

ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -