ప్రభాస్ ‘ఆది పురుష్’ షూటింగ్ ఆరంభించారా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో జాతీయ స్థాయి నటుడుగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘సాహో’ చిత్రంతో బాలీవుడ్ లో సత్తా చాటినా.. ఇతర భాషల్లో నిరాశ పరిచాడు. తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ‘రాధేశ్యామ్’ మూవీ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న నూతన చిత్రం ఆదిపురుష్.

ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రియాల్టీ సన్నివేశాల కన్నా అంతా గ్రాఫిక్స్ మాయాజాలం ఉండబోతుందట. దాంతో రెండు ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఆదిపురుష్ కోసం ఇప్పటికే పనులు పనులు స్టార్ట్ చేశాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

- Advertisement -

ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఒక విజువల్స్ వండర్‌గా తీర్చిదిద్దాలని ఓం రౌత్ ప్రయత్నిస్తున్నారు. ఇక నటీనటులతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News