Wednesday, May 8, 2024
- Advertisement -

కదిలించిన బొమ్మలు కథ

- Advertisement -

అది ఒక్క చిన్న చిత్రం…
చిన్న ఆర్టిస్ట్ లతో రూపొందిన చిత్రం..
దర్శకుడు,నిర్మాత అందరూ కొత్తవారే…
ఏదో చేసేసాం కదా అని… మమ అనిపించే టైప్ కాదు.

చేసినందుకు ఆ సినిమా తాలూకు రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉండాలని ఆ మూవీ యూనిట్ బావించింది.అందుకే బాలచందర్ ఫ్లేవర్ తో కదిలే బొమ్మల కథ అని టైటిల్ పెట్టి అందరినీ స్మూత్ గా కట్టిపడేశారు.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది. కాని ఆడియో లాంచ్ తో సినిమా  హిట్ అయినంత పని అయింది. నిజానికి ఈ ఆడియో లాంచ్ కు దాసరి  రావల్సి ఉంది. కేవలం ఆరోగ్య కారణాల వలన ఆయన రాలేకపోయారు.వచ్చి ఉంటే…ఒక చిన్న చిత్రం ఇంతటి ఇదిగా ఆడియోను లాంచ్ చేసుకోవడం చూస్తే… ఆయన దీన్ని చూసి చాలా ఆనందపడి ఎప్పటిలాగానే…మాంచి మూడ్ లో మరో రెండు మూడు సంచలన కామెంట్లే చేసేవారు.ఇంతలా ఎందుకు చెపుకోవల్సి వచ్చిందంటే…ఈసినిమా కాన్సెప్టే కాదు,ఈవెంట్ కూడా అంతటి అధ్బుతంగా జరిగింది మరి. ఈమధ్య కాలంలో అంతకు ముందు ఏమాత్రం నోటెడ్ కాని ఓ మూవీ యూనిట్… ఇంతలా నోటెడ్ అయ్యిందంటే ఆడియో లాంచ్ ఎంతటి సక్సెస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.
మగాళ్ల కంటే మృగాల మిన్న అనే లైన్ తో సాగే సాంగ్ కు బెస్ట్ సాంగ్ అవార్డ్ వచ్చినా రావచ్చు. ఈసినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన శశి…స్వయాన సీనియర్ ఆర్టిస్ట్ ప్రసాద్ బాబుకు అల్లుడు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ, బిజ్జాల దేవ నాజర్ ,జీవా లాంటి హేమా హేమీలు ఈసినిమా యూనిట్ ను ఆశీర్వదించడానికి వచ్చారు.హీరో హీరోయిన్లుగా శ్రీతేజ్ ,అనన్య షెట్టిలు తళుక్కుమన్నారు. హీరోగా శ్రీతేజ్ కు ఈసినిమా మూడో పిక్చర్ అయినా… అతని కెరియర్ కు ఇది టర్నింగ్ పిక్చర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్ అయినా ఈసినిమాకు ఆద్యామీడియా సోషల్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
ఆద్యామీడియా/ఆద్యానూస్ అధినేత యల్.వి. సుబ్బా రెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్ కు బొకే ఇచ్చి…కార్యక్రమాన్ని  ప్రారంభించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -