Wednesday, April 24, 2024
- Advertisement -

బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటుడు అరుణ్‌ గోవిల్‌!

- Advertisement -

ఒకప్పుడు టివిలో సీరియల్స్ అంటే ప్రేక్షకులు ఎంతో మక్కువ చూపించేవారు.  1980ల్లో రామాయణం, మహాభారత్ టీవి సీరియల్స్ అంటే చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు టివిలకు అతుక్కు పోయేవారు అంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు టెక్నాలజీ మారింది.. దానితో పాటు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ టీవిల్లో ప్రసారం అవుతున్నా.. ఆనాటి రామాయణ, మహాభారత్ కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. కరోనా సందర్భంగా లాక్ డౌన్ విధించినప్పుడు దూరదర్శన్ లో రామానంద్ సాగర్ ‘రామాయణ్’ను పునః ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

ఈ సీరియల్ లో సీత పాత్ర పోషించిన దీపికా చికిలియా, రావణ పాత్రధారి అరవింద్ త్రివేది ఇప్పటికీ బీజేపీ లో చేరి ఆ పార్టీ తరఫున పార్లమెంట్ కూ ఎన్నికయ్యారు. తాజాగా శ్రీరాముడి పాత్రలో నటించిన అరుణ్‌ గోవిల్‌ నేడు బీజేపీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన గోవిల్‌ పలు సినిమాల్లో నటించడంతో పాటు స్వయంగా సినిమాలు, వివిధ భాషల్లో టీవీ షోలను రూపొందించారు. అయితే 1987లో ప్రసారమైన రామాయణం సీరియల్ ను తిరిగి ఇటీవల ప్రసారం చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కావడం ఇవన్నీ జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు ఊపయోగపడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

హై కోర్టు లో చంద్ర బాబు పోరాటం..!

తెలంగాణ నీటి బడ్జెట్ చూశారా.. అంతా లెక్కలే..!

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -