Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ నీటి బడ్జెట్ చూశారా.. అంతా లెక్కలే..!

- Advertisement -

నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం, పరిశ్రమలు అన్ని రంగాలు కళకళలాడుతాయని… ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెల పోతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసని… చెరువులు ధ్వంసమై పోయి, బావులు, బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించిందని గుర్తుచేశారు. రాష్ట్ర వార్షిక పద్దును శాసనసభలో ప్రవేశపెట్టి సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు కేటాయించారు.

గత పాలకులు అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని… అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారని వ్యాఖ్యానించారు. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయిందని… సీతారామ ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని… పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టమని.. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి వందమీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని, 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్​లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచామన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్​లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశామన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపామని వెల్లడించారు.

హై కోర్టు లో చంద్ర బాబు పోరాటం..!

తాడిపత్రి లో జేసీ ఫిక్స్.. విజయవాడ లో భాగ్యలక్ష్మి..!

తెలంగాణ బ‌డ్జెట్‌ ప్ర‌వేశ పెట్టిన హ‌రీశ్ రావు.. రూ.2,30,825.96 కోట్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -