- Advertisement -

ఈ వారం ఏ సినిమా ఎంత వసూలు చేసిందంటే…

- Advertisement -

బాహుబలి సినిమా మొత్తంగా వంద కోట్ల రూపాయలు ఫిగర్ కు రీచ్ అయ్యింది.

జాగ్రత్తలు తీసుకొని లో బడ్జెట్ మూవీ గా రూపొందిన ‘జేమ్స్ బాండ్’ సేఫ్ జోన్ లోకి వచ్చింది.

ఇక డబ్బింగ్ సినిమా ‘జిల్లా’ కూడా పర్వాలేదనిపించుకొంది. బయ్యర్లకు పెట్టుబడులు దక్కేలా చేసింది. ఇదీ ఈ వారాంతపు ట్రేడ్ రిపోర్ట్.

 

మొన్నటి శుక్రవారంతోనే ‘బాహుబలి’ విడుదల అయ్యి మూడు వారాలు పూర్తి అయ్యాయి. భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు నుంచే ఈ సినిమాను చూడటానికి జనాలు పోటీ పడ్డారు. తొలివారం అంతా అలాంటి డిమాండ్ తోనే ఈ సినిమా నడిచింది. దీని ధాటికి భయపడి మళ్లీ శుక్రవారం సినిమాలు కూడా విడుదల కాలేదు. దీంతో రెండు వారాల పాటు బాహుబలి హవా నడిచింది. మూడోవారం ప్రారంభానికి జేమ్స్ బాండ్ , జిల్లా సినిమాలు పోటీకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో బాహుబలి కలెక్షన్లు 90 నుంచి వంద కోట్ల రూపాయల మధ్య ఉన్నాయని తెలుస్తోంది. కేవలం తెలుగు వెర్షన్ వరకే ఈ సినిమా ఈ స్థాయి లో వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తోంది. పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే.. ఈ సినిమా కు ఇప్పుడిప్పుడే లాభాలు మొదలయ్యాయని అనుకోవాల్సి వస్తోంది. ఇక వరస ఫెయిల్యూర్ ల మధ్య ఉన్న అల్లరి నరేష్ కు జేమ్స్ బాండ్ ఊరటనిచ్చింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన జేమ్స్ బాండ్ పర్వాలేదనిపించుకొనే టాక్ తో.. లాభాల దిశగా వెళుతోంది.

ఇక రీమేక్ కావాల్సిన “జిల్లా” తెలుగులోకి డబ్ అయ్యి విడుదల అయ్యింది. దీంతో అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చాయి. డబ్బింగ్ బొమ్మ కాబట్టి.. ఈ మాత్రంతోనే సేఫ్ జోన్లోకి వచ్చిందని.. దీన్ని విడుదల చేసిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు లాభాలు స్వీకరిస్తున్నారని సమాచారం. మొత్తానికి మూడువారాల మూడు సినిమాలూ.. సేఫ్ అనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -