Monday, May 6, 2024
- Advertisement -

బాబు బాగా బిజీ మూవీ రివ్యూ

- Advertisement -
babu baga busy movie review in telugu

కొత్త దర్శకుడు నవీన్ మేడారం డైరెక్షన్ లో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘బాబు బాగా బిజీ’. ఈ సినిమా అడల్ట్ కామెడీ నైపథ్యంలో ఉండే బాలీవుడ్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా రూపొందడం, ట్రైలర్, పోస్టర్లు కూడా కాస్తంత హాట్ గా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యూత్ లో క్రేజ్ నెలకొంది. మరి ఈ రోజు రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మాధవ్‌(అవసరాల శ్రీనివాస్‌) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌..పేరు కు మాత్రమే సాఫ్ట్ లోపలంతా కామమే..ఏ అమ్మాయిని చూసిన తనతో గడపాలనుకునే స్వభావం కలవాడు..ఆలా ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు..ఆలా చేసి చేసి బోర్ కొట్టి..చివరకు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు..కాకపోతే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తన గురించి అంత చెప్పాలనుకుంటాడు.. ఆలా పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి అమ్మాయి దగ్గర తన గురించి చెప్పడం తో ఎవరు కూడా మాధవ్ ను ఇష్టపడరు..దీంతో తన ఫ్రెండ్స్ ఇంకా ఫై చేసే అమ్మాయికి నీ గురించి చెప్పకు అని బలవంతం చేయడం తో రాధా (మిస్తీ)కి మాత్రం గతం చెప్పకుండా దగ్గరవుతాడు. ఆమెతో మాధవ్‌కి పెళ్లి నిశ్చయమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..రాధా కు మాధవ్ గురించి తెలుస్తుందా..లేదా..? అసలు మాధవ్ జీవితం లోకి పారు(మదివాడ తేజస్వి).. శోభ(శ్రీముఖి).. చంద్రిక (సుప్రియ) ఎలా వచ్చారు..? అసలు మాధవ్ కు వారికీ సంబంధం ఏంటి..అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో ముఖ్యంగా ప్లస్ పాయింట్ విషయంకు వస్తే ఎంచుకున్న నైపథ్యమనే చెప్పాలి. నిజానికి దగ్గరగా ఉండే ఈ కథ లైన్ సినిమా పట్ల ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయింది. ఇక చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీనివాస్ అవసరాల చాలా చక్కగా మంచి నటన కనబరచడు. ముఖ్యంగా అతని పాత్రకు రాసిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సినిమా ఆరంభంలో వచ్చే హీరో యొక్క చిన్ననాటి జీవితంలో జరిగే కొన్ని సంఘటనల తాలూకు సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ ఎపిసోడ్లో ఇన్స్పెక్టర్ గా పోసాని కృష్ణ మురళి చేసిన కాస్తంత కామెడీ నవ్వించింది. హీరో మారుదామనుకుని, హీరోయిన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నించే కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. రియలిస్టిక్ లొకేషన్లలో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపారు.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీ కామెడీ నైపథ్యంలో ఉన్నప్పటికి.. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు అని చెప్పడం వల్ల.. ప్రేక్షకులకు సినిమాలో ఎంటర్టైన్మెంట్ దొరకకపోవడంతో.. సినిమాలో ఇది పెద్ద మైనస్ అయ్యింది. ఆరంభం కొంచెం బాగానే ఉన్నా తర్వాత రొటీన్ గానే అయ్యింది. పోసాని కామెడీ మినహా ఎక్కడా ఎంజాయ్ చేయగల కంటెంట్ కొంచెం కూడా దొరకలేదు. పైగా దర్శకుడు నవీన్ మేడారం కథనాన్ని కాసేపు ప్రస్తుతంలో ఇంకాసేపు గతంలో నడుపుతుండటంతో కాసేపటికే ఆ విధానం బోర్ అనిపించింది. హీరో జీవితంలో ఉండే అమ్మాయిల్లో ఏ ఒక్కరినీ కూడా డీటైల్డ్ గా చూపకపోవడం, వాళ్ళతో హీరో రిలేషన్ ఎలా సాగింది అనేది చెప్పకపోవడంతో నిరుత్సాహం కలిగింది. అలాగే కథనం కూడా ఒక ట్రాక్లో నడవకుండా కాసేపు హీరోలోని చెడు, కాసేపు అతనిలోని మంచిని చూపించడంతో వాటిలో ఏ ఒక్కటి కుడా చూసే ప్రేక్షకుడికి బలంగా కనెక్టవ్వలేకపోయాయి. ఇక నెమ్మదిగా.. అడాప్ట్ చేసుకోలేని ఎమోషన్ తో సాగే సెకండాఫ్లో హీరో మారడానికి కారణమైన అంశాలని కథతో కనెక్టయ్యే విధంగా చూపలేకపోవడవంతో ముఖ్యమైన ఆ అంశం కూడా సైడ్ ట్రాక్లో నడుస్తున్నట్టు అనిపించి కథనానికి అడ్డుపడుతున్నట్లుగా తోచింది. అలాగే చెడుకు, మంచికి మధ్య హీరో పాత్ర పడే ఘర్షణను కూడా సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు దర్శకుడు. ప్రియదర్శి వంటి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ ని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. చివరి క్లైమాక్స్ అయితే చాలా సాదాసీదాగా, రొటీన్ గానే ఉంది తప్ప కొత్తగా, ప్రభావంతంగా ఏమీ లేదు.

మొత్తంగా :

తెలుగులో ప్రస్తుతం భిన్నమైన కథలకు మంచి డిమాండ్ ఉంది. అడల్ట్ కామెడీ కంటెంట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా అసలు కనిపించలేదు. ఆకట్టుకున్న శ్రీనివాస్ అవసరాల నటన, ఫస్టాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పోసాని కామెడీ ఇందులో ప్లస్ పాయింట్స్ గా ఉండగా… కథనంలో దమ్ము లేకపోవడం.. ఎమోషనల్ గా ప్రేక్షకుడిని తాకలేకపోయిన క్లైమాక్స్ దర్శకత్వంలో లోపం ఇవన్నీ మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా చూసి భాదపడేకన్నా.. ట్రైలర్లే చూసి అనందపడటం భేటర్ గా అనిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -