మానవత్వం చాటుకున్న బండ్ల గణేశ్​..

- Advertisement -

ఓ సాధారణ నటుడి నుంచి బడా నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేశ్​. ఇక బండ్ల గణేశ్​ జీవితంలో వివాదాలు కూడా తక్కువేం లేవు. నిత్యం ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంటాడు. గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. కొంతకాలానికి అతడు స్థాపించిన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్​ నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. అయితే త్వరలోనే పవన్​ కల్యాణ్​తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు బండ్ల గణేశ్​.

అంతేకాక బండ్ల గణేశ్​ పవన్​ కల్యాణ్​కు వీరాభిమాని. ఆయన పేరు చెబితేనే బండ్ల గణేశ్ ఊగిపోతూ ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరికినా పవన్​ కల్యాణ్​ను ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు బండ్ల గణేశ్​. ఈ సారి మాత్రం.. వివాదం సృష్టించి కాదు.. ఓ మంచి పని చేసి.. ప్రశంసలు పొందాడు.

ఇటీవల ఓ నెటిజన్​ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టాడు. తన తల్లి బ్రెస్ట్​ క్యాన్సర్​తో బాధపడుతున్నదని అందుకు రూ. 20 లక్షలు అవసరం ఉందని.. కాబట్టి సాయం చేయాలంటూ కోరాడు.ఈ పోస్ట్ చూసిన బండ్ల గణేశ్​ వెంటనే స్పందించాడు. అతడి గూగుల్​ పే నంబర్​ తీసుకున్నాడు. తప్పకుండా అవసరమైన సాయం చేస్తానంటూ చెప్పాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేశ్​ను ప్రశంసిస్తున్నారు.

Also Read

బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

పుష్పలో విలన్​గా సునీల్​..!

2022.. ప్రభాస్​ నామ సంవత్సరం అవబోతుందా?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -