పుష్పలో విలన్​గా సునీల్​..!

కమెడియన్​గా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు సునీల్​. కేవలం అతడి కామెడీతోనే ఆడేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కమెడియన్​గా తన కెరీర్​ పీక్​లో ఉన్నప్పుడు సునీల్​కు హీరోగా చాన్స్​ వచ్చింది. దీంతో అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాల్లో హీరోగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా కనిపించినప్పటికీ పెద్దగా ఆడలేదు. హీరోగా కంటే కమెడియన్​గా నే బెటర్​ అనుకొని .. మళ్లీ క్యారెక్టర్లే చేస్తున్నాడు సునీల్​.

అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి చిత్రాల్లో కామెడీ రోల్స్​ చేశాడు. ఇదిలా ఉంటే పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పలో సునీల్​ విలన్​గా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో విలన్​గా మలయాళ నటుడు పహద్​ ఫాజిల్​ ఎంపికయ్యాడు. మరో పాత్రకు సునీల్​ సెలెక్టయ్యాడని టాక్​. కలర్​ ఫొటో, డిస్కో రాజా వంటి చిత్రాల్లో సునీల్​ విలన్​గా కనిపించి మెప్పించాడు. దీంతో పుష్పలో సునీల్​కు విలన్​గా అవకాశం దక్కింది.

మరోవైపు పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్నది. అల్లు అర్జున్​ మాస్​ లుక్​లో కనిపించబోతున్నాడు. ఓ లారీ డ్రైవర్​ పాత్ర వేశాడు. ఇక రష్మిక మందన్న గిరిజన యువతిగా కనిపించబోతున్నది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సునీల్​ ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Also Read

బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

చిరు-బాబీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..కథ ఇదేనా..!

అన్మాత్తే పై పుకార్లు నమ్మొద్దు

Related Articles

Most Populer

Recent Posts