2022.. ప్రభాస్​ నామ సంవత్సరం అవబోతుందా?

- Advertisement -

ప్రభాస్​ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్​ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 2019 ఆగస్టు 9న ప్రభాస్​ నటించిన సాహో విడుదలైంది. అప్పటినుంచి ఇక ఒక్క సినిమా కూడా రిలీజ్​ కాలేదు. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉంటే 2022 సంవత్సరంలో ప్రభాస్​ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నిజానికి హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్​తో ఈ మూవీ విడుదల కాలేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్​ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతి కానుకగా 2022 జ‌న‌వ‌రి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఇక ఇదే ఏడాది వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 14న స‌లార్ విడుదల కాబోతున్నది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు కారణం కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హీరోకు మాస్​ ఎలివేషన్స్​ ఇవ్వడంలో ప్రశాంత్​ నీల్​ది అందెవేసిన చేయి. దీంతో ఈ మూవీపై విపరీతమైన హైప్​ క్రియేట్ అయ్యింది.

ఇక 2022 ఆగ‌స్టు 11న మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా .. సైఫ్​ అలీఖాన్​ రావాణాసురుడిగా కనిపిస్తున్నాడు. ఇలా 2022 సంవత్సరం ప్రభాస్​ ఫ్యాన్స్​కు పండగలా మారిపోబోతున్నది.

Also Read

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

సందీప్ కిషన్ ని ఢీ కొడుతున్న తమిళ స్టార్ హీరో.. ఎవరంటే..!

రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -