Friday, May 10, 2024
- Advertisement -

కౌషల్ ఆర్మీ టార్గెట్ 30 కోట్ల ఓట్లు పైనే

- Advertisement -

10 సార్లు నామినేట్ అయినా కౌషల్ సేవ్ అయ్యాడంటే అతడు పడిన కష్టానికి తోడు అభిమానులు పడిన కష్టమే కారణం. మొదట్లో అందరి కంటెస్టెంట్లలో ఒకడిగానే ఏ ప్రత్యేకతా లేకుండా ఉన్న కౌషల్ కొద్దిరోజులకే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిగిలిన హౌస్ మేట్స్ గ్రూపిజంతో, ఆధిపత్య ధోరణితో వ్యవహరించినా కౌషల్ ఎప్పుడూ ఎక్కడా బెండ్ కాలేదు. వారిలా రిలేషన్స్ ఎమోషన్స్ అంటూ అసలు లక్ష్యం మరిచిపోయి వ్యవహరించలేదు. గేమ్ గెలవడానికి వచ్చాను. గెలిచేందుకు మాత్రమే ఆడతాను అని చెప్పాడు. చెప్పినట్లే ప్రతి టాస్కులోనూ ఒంటరి పోరాటంతో కష్టపడి కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో అతడు ఎప్పుడు నామినేట్ అయినా కోట్ల ఓట్లు టార్గెట్ పెట్టుకుని అతడిని ఫ్యాన్స్ గెలిపిస్తూ వచ్చారు. ఆయా వారాల వారీగా 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల ఓట్లు అంటూ టార్గెట్ పెట్టుకుని ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓ దశలో 70 శాతం ఓటింగ్ తో 18 కోట్ల ఓట్లు వేసి రికార్డ్ సృష్టించారు. అయితే ఇన్నాళ్లు ఒక ఎత్తు, శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక ఎత్తు కావడంతో ఈ సారి కౌషల్ ఆర్మీ 30 కోట్ల ఓట్లకు పైగానే టార్గెట్ విధించుకుంది. వివిధ వెబ్ సైట్స్, యూ ట్యూబ్ చానెల్స్, నిర్వహిస్తున్నఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాల శాంపిల్స్ ద్వారా ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

సోమవారం రాత్రి పదిన్నర గంటల నుంచి ఆన్ లైన్ పోల్ స్టార్ట్ కావడంతో ఆ రోజు రాత్రి 12గంటల లోపే 70 శాతం ఓటింగ్ సాధించారు. ఇక 12 గంటల తర్వాత కూడా అదే రీతిన ఓటింగ్ కొనసాగుతోంది. 74 శాతానికి పైబడే కౌషల్ ఈ వారం ఓట్లు సంపాదించుకంటున్నాడు. అయితే ఇన్నాళ్లూ ఆన్ లైన్ ఓటింగ్ కే ప్రాధాన్యమిచ్చిన ఆయన అభిమానులు ఈ సారి మిస్డ్ కాల్స్ మీద కూడా ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టారు. రోజుకు ఒక్కో సిమ్ కార్డ్ నుంచి 50 మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ మెయిల్ అకౌంట్స్ తో ఒక్కొక్కరూ వందలు, వేల ఓట్లు వేస్తున్నారు. తమ ఇళ్లలోని అన్నిఫోన్లతోపాటు, తెలిసినవారందరి ఫోన్ల ద్వారా, చుట్టాలు బంధువులు, స్నేహితులు అందరి ఫోన్ల ద్వారా కౌషల్ నంబర్ కు మిస్డ్ కాల్స్ ఇస్తూ యుద్ధంలా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. కౌషల్ ఫ్యాన్సు కసి, చూస్తుంటే ఈ సారి బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు తప్పవనిపిస్తోంది. ఈ సారి ఫినాలే కావడంతో ఏకంగా 30 కోట్ల పైనే ఓట్లు వేయాలని, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని, కౌషల్ ను అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని కసితో రగిలిపోతున్నారు. కౌషల్ ఆర్మీ ఎవరికి వారు సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తూ, జనంతో కౌషల్ కు ఓట్లు వేయిస్తున్నారు. వారి దూకుడు చూస్తుంటే అవలీలగా 30 కోట్ల ఓట్లపైనే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని అర్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -