- Advertisement -

టీడీపీ పార్టీకి ఊపు తెచ్చిన బోయ‌పాటి

- Advertisement -

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల్లో బోయ‌పాటి శ్రీను కూడా ఒక‌రు. హీరోల‌ను ఊర మాస్‌గా చూపించ‌డంలో బోయ‌పాటి దిట్ట. బాల‌య్య‌, ఎన్టీఆర్, బ‌న్ని, రామ్ చ‌ర‌ణ్ వంటి హీరోల‌తో సినిమా చేసి వారికి మంచి హిట్లు ఇచ్చాడు. అయితే బోయపాటికి తెలుగు దేశం పార్టీతో మంచి బంధాలు ఉన్నాయి. కృష్ణ పుష్కరాల స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ యాడ్ తీశాడు బోయ‌పాటి. ఆ యాడ్ వ‌ల్లే పుష్కరాల స‌మ‌యంలోనే దాదాపు 40 మందికిపైగా మ‌ర‌ణించార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండంతో బోయ‌పాటి చేత పార్టీ యాడ్స్ చేయించారు చంద్ర‌బాబు. ఇప్పుడు మ‌నం టీవీల్లో చూస్తున్న టీడీపీ యాడ్స్ చేసింది అన్ని బోయ‌పాటే. ఈ మధ్య‌ కాలంలో కమర్షియల్ యాడ్స్ కంటే తెలుగు దేశం యాడ్స్ ఎక్కువ అయ్యాయి. ఆ యాడ్స్ క్వాలిటీ పరంగా రీ రికార్డింగ్ పరంగా ఆకట్టుకుంటున్నాయి.

మంచి నటీనటులను ఎంపిక చేయడంతో పాటు, మంచి స్క్రీన్ ప్లే , కెమెరా వర్క్ తో యాడ్స్ ఉండటం అందరిని ఆకర్షిస్తోంది. తెలుగు దేశం పార్టీ యాడ్స్ తో ఆ పార్టీలో జోష్ పెరిగింది. దీని వెన‌క బోయ‌పాటి హ్యాండ్ ఉంద‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాక‌ముందు నుంచే యాడ్స్ ఎలా చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట‌ బోయ‌పాటి. త‌న ఆలోచ‌ల‌న‌కు టీడీపీ పార్టీ నుంచి మ‌ద్ద‌తు రావ‌డంతో మంచి న‌టుల‌ను ఎంపిక చేసుకుని యాడ్స్‌ను తీశార‌ట‌. ఈ యాడ్స్‌తో టీడీపీ నాయకులు మంచి జోష్‌లో ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతానికి అయితే తెలుగు దేశం యాడ్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే బోయపాటి పొలిటికల్ యాడ్స్‌తో దుమ్ము రేపుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -