Monday, May 6, 2024
- Advertisement -

బ్రహ్మోత్సవం రివ్యూ!

- Advertisement -

శ్రీకాంత్ అడ్డాల – మహేష్ బాబు లు ఇద్దరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే అందరికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుర్తొచ్చి తీరుతుంది. విడుదల అయ్యి ఇన్నేళ్ళు అయినా ఇప్పటికీ టీవీ లో వేస్తే ఫామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా అది.

అలాంటి కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే ఫామిలీ ప్రేక్షకుల కోసం ఇద్దరూ బ్రహ్మోత్సవం అంటూ సినిమా మొదలు పెట్టినప్పుడే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందులో మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ఈ సినిమా చేస్తూ ఉండడం తో ఒక రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్ లు పెరిగిపోయాయి.ఇంతకీ సినిమాకి ఉన్న హైప్ ని ఏ మేరకు బ్రహ్మోత్సవం బృందం అందుకుందో చూద్దాం రండి.

కథ – పాజిటివ్ లు:

సాధారణ కుర్రాడిగా తండ్రి అంటే ప్రాణం ఇచ్చే కొడుకు గా మహేష్ బాబు కనిపిస్తాడు. బంధాలకీ , బందుత్వాలకీ పెద్ద పీట వేసే సత్యరాజ్ తండ్రి అయితే అతని కొడుకు మహేష్ రిలేషన్స్ మీద పెద్దగా ఆసక్తి చూపించని వ్యక్తి. ఫంక్షన్ లకీ వాటికీ వెళ్ళకుండా తల్లీ తండ్రీ ఉంటె చాలు అని మిగితా అందరూ పిచ్చ లైట్ అనుకునే మనస్తత్వం తో ఉంటాడు. హీరో కి బంధుత్వాల గొప్పతనం చెబుతూ తండ్రి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. నలుగురు బావమరుడులతో బిజినెస్ మొదలు పెట్టి నాలుగు వందల కోట్లకి చేరుకున్న సత్యరాజ్ కీ పెద్ద బావ మరిది రావు రమేష్ కీ మధ్యన ఇగో క్లాష్ ని మెయిన్ పాయింట్ గా నడిపారు. మహేష్ బాబు తన పెర్ఫార్మెన్స్ తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు.నటన లో ఎప్పుడూ ఫార్మ్ లో ఉండే మహేష్ బాబు ఈ సినిమాతో మరొక మెట్టు ఎక్కేసాడు అని చెప్పచ్చు. సత్యరాజ్ – మహేష్ ల మధ్య ఒచ్చే సీన్ లు బాగా కుదిరాయి . ముఖ్యంగా మహేష్ సత్యరాజ్ కాళ్ళకి చెప్పులు తొడిగే సీన్ భలే నచ్చుతుంది అందరికీ. మహేష్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో తన సత్తా చూపించాడు. రావు రమేష్ కి కూడా ఇక్కడ యాక్షన్ కి మంచి స్కోప్ ఒచ్చింది. రావు రమేష్ నటన కి థియేటర్ లో చప్పట్లు వినిపించాయి కాస్త గట్టిగానే. సత్యరాజ్ చనిపోయినప్పుడు మహేష్ నటన అద్భుతం అని చెప్పాలి. మహేష్ సరసన కాజల్ – సమంత చక్కగా ఒదిగిపోయారు. రేవతి , జయసుధ తమ పరిధి లో చాలా బాగా చేసాడు. మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అవగా DOP తన టాలెంట్ ని పాటలు తీయడం లో చూపించాడు. అన్ని పాటలూ స్క్రీన్ మీద క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది. మంచి ఫీల్ ని ఇస్తూ పాటలు సాగుతాయి. స్క్రీన్ ప్లే విషయం లో చాలా చోట్ల స్లో గా అనిపించిన అడ్డాల . మహేష్ బాబు ఇప్పటి వరకూ చెయ్యని ఒక కొత్త లవ్ ట్రాక్ చేసాడు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో కథ లేక పోయినా సీన్ లు చాలా పెర్ఫెక్ట్ గా రాసుకోవడం తో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ లో ఆసక్తికర మలుపు తిరుగుతుంది చిత్రం.

నెగెటివ్ లు

స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండడం వలన బోర్ కొట్టే సన్నివేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కామెడీ కోసమే సినిమాలు విపరీతంగా చూసే జనాలు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. డైరెక్టర్ ప్రత్యేకంగా కమీడియన్ లని పెట్టకుండా ఉన్నవాళ్ళలో కామెడీ ని లాగించేద్దాం అనుకోవడం తో అక్కడక్కడా కామెడీ వెటకారం అయిపొయింది. కొన్ని చోట్ల అత్తారింటికి దారేది షేడ్ లు కనిపిస్తాయి. మహేష్ – కాజల్ మధ్యన కుదిరిన కెమిస్ట్రీ , మహేష్ – సమంత ల మధ్యన కుదరలేదు. పాటల చిత్రీకరణ బాగుంది కానీ అనవసరమైన చోట ఎక్కువగా పాటలని ఇరికించినట్టు అనిపించి విసుగు తెప్పిస్తాయి పాటలు. సెంటిమెంట్ సీన్ లలో కాస్త ఓవర్ గా యాక్ట్ చేసారుమిగితా యాక్టర్ లు, ఇది కాస్త అనవసరమైన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. సెకండ్ హాఫ్ లో విపరీతమైన స్లో స్క్రీన్ ప్లే తో పాటు అవసరం లేని సీన్ లు బోలెడు ఒస్తూ ఉంటాయి, ముఖ్యంగా ప్రేక్షకులకీ కథకీ మధ్య కనక్షన్ తీవ్రంగా దెబ్బ తింటుంది. అది సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ .

మొత్తం గా

సీతమ్మ వాకిట్లో సినిమా తరవాత మహేష్ – శ్రీకాంత్ అడ్డాల ల కాంబినేషన్ లో రావాల్సిన సినిమా కాదు ఇది . బోరింగ్ డ్రామా గా సాగుతూ సినిమా ఏ పంచెన నుంచి ఏ పంచన కి చేరుతోంది కూడా అర్ధం కాకుండా ఉంటుంది చాలా చోట్ల. రిచ్ నేస్ మీదా జనాల మీద దృష్టి పెట్టిన శ్రీకాంత్ అడ్డాల సరైన పాయింట్ ని ఇవ్వడం లో ఫెయిల్ అయ్యారు. బంధుత్వాల మధ్యన ఇగో అనే కాన్సెప్ట్ అత్యంత అద్భుతంగా తీసుకున్నారు కానీ దానికి తగ్గ సరైన పాయింట్ ని ఇవ్వలేక కుప్పకూలిపోయాడు డైరెక్టర్. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ లు హ్యాండిల్ చేసి ఉంటె చాలా బాగుండేది అని చెప్పచ్చు. ఫామిలీ లో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాని మీద రేవేన్యూ ఆధారపడి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -