Wednesday, April 24, 2024
- Advertisement -

‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ

- Advertisement -

శ్రీ విష్ణు, నివేతా థామస్, నివేతా పెత్తురాజ్, సత్యరాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, మొదలగు వారు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమా ఈ రోజు కల్కి సినిమా తో పాటు విడుదల అయింది. ముందు నుండి ఈ సినిమా కి ఎంతో పాజిటివ్ బజ్ వచ్చిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కూడా అందరినీ ఎంత గానో ఆశ్చర్యపరిచింది. మెంటల్ మదిలో సినిమా ని దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమా కి దర్శకుడు. వివేక్ సాగర్ ఈ సినిమా కి స్వరాలూ సమకూర్చారు. ఇక ఈ సినిమా సమీక్ష కథ:విషయానికి వస్తే..

కథ:
ఈ సినిమాలో రెండు కథలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఒక కథ లో దర్శకుడు కావాలని అనుకుంటున్నా విశాల్ (సత్యదేవ్) తన కథ తో హీరోయిన్ షాలిని (నివేతా పెత్తురాజ్) ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరో కథ లో టీనేజర్లు (ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు) మిత్ర (నివేత థామస్) అనే అమ్మాయి వెంట పడుతూ ఉంటారు. అయితే అనుకోని విధంగా ఈ కథలు రెండూ ఒక క్రైమ్ కి అనుసంధానం చేయబడతాయి. ఆ క్రైమ్ ఏంటి? అసలు ఈ కథలు ఎలా మొదలవుతాయి? ఎలా పూర్తి అవుతాయి? అనేది సినిమా కథ.

నటీనటులు:
ప్రతి సినిమా లోనూ ఏదో ఒక విధంగా తన పర్ఫామెన్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తున్న యువ హీరో శ్రీ విష్ణు ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ పై దృష్టి పెట్టిన శ్రీ విష్ణు ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. నివేదా థామస్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆమె అందం, అభినయంతో మాత్రమే కాక డాన్స్ తో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. సత్య దేవ్ కి కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది. తన నటనతో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. నివేత పేతురాజ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది. ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ల కామెడీ ఈ సినిమాకి మరొక పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమా కోసం మంచి కథను సిద్ధం చేసుకోవడం మాత్రమే కాక అంతే ఆసక్తికరంగా దానిని తెరకెక్కించారు. వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం అందించిన నిర్మాణ విలువలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా దర్శకులు ఈ సినిమా కోసం మంచి భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ క్లీన్ గా ఉంది.

తీర్పు:
మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఆఖరి వరకు అంతే ఆసక్తికరంగా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. సినిమా లోని మొదటి హాఫ్ మొత్తం కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. ఫస్టాఫ్ లో ఆర్ 3 బ్యాచ్ మధ్య స్నేహం, మరియు శ్రీ విష్ణు, నివేదాథామస్ మధ్య ప్రేమ కథ చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్టు ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ మరింత ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. నటీనటులు మంచి కథ మరియు స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రెండవ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినప్పటికీ కథ ఆసక్తికరంగా ఉండటంతో పరవాలేదనిపిస్తుంది. చివరగా ‘బ్రోచేవారెవరురా’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడవలసిన ఎంటర్టైనింగ్ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -