Friday, May 10, 2024
- Advertisement -

పైర‌సీపై జ‌వాన్ బెంగ‌

- Advertisement -
  • విడుద‌లైన నాడే మ్యాట్నీకే కాపీ బ‌య‌ట‌కు
  • దిగాలులో సినిమా ద‌ర్శ‌కుడు, నిర్మాత‌

ఎన్నో ఆశ‌ల‌తో మెగా అల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. కానీ వ‌చ్చిన రోజు మ‌ధ్యాహ్ననికే నిరుత్సాహ‌ప‌డ్డాడు జ‌వాన్‌. విడుద‌లైన రోజు మ‌ధ్యాహ్న‌నికే పైరసీ బ‌య‌ట‌కు రావ‌డంతో షాక్‌కు గుర‌య్యారు. నిజంగానే ఇంటికొక్క‌రు మాదిరిగా ఇంటికొక సినిమా కాపీ వ‌చ్చేలా క‌నిపిస్తోంది. అంత‌లా పైర‌సీ రోగం పెరిగిపోయింది. పాపం సినిమా వాళ్ల క‌ష్టాన్ని ఏదో క్రేజీ కోసమో.. చేస్తున్నారు. సినిమా చూడ‌డానికి డ‌బ్బులు లేక కాదు. డ‌బ్బులు సంపాదించుకోవ‌డానికి ఈ విధంగా అక్ర‌మ మార్గం ప‌డుతున్నాడు. ఈ సినిమా పైర‌సీపై జ‌వాన్ (ఇంటికొక్కడు) దర్శకుడు బీవీఎస్‌ రవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు.

వంద‌మంది క‌లిస్తే సినిమా. అంటే వంద కుటుంబాలు క‌లిస్తే సినిమా అవుతుంది. పైర‌సీ విడుద‌లైతే ఆ వంద కుటుంబాలు రోడ్డు మీద ప‌డ‌తాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ర‌వి. రెండేళ్లు క‌ష్ట‌పడి క‌థ రాసి.. 24 గంట‌లు హీరోని ఒప్పించి… హీరో స‌హయంతో నిర్మాత‌ను క‌లిసి.. నిర్మాత కోట్లు కుమ్మ‌రించి సినిమా తీస్తే 24 గంట‌లు కాక‌ముందే సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఏందిదీ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు. కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి సర్‌ అని నిర్మాతని అడిగితే ‘పైరసీ కలెక్షన్స్‌ బాగున్నాయి’ అని అన్నార‌ని వాపోయారు. చివ‌రికి బ‌స్సుల్లో ప్ర‌సారం అవుతుండ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. దయచేసి ‘జవాన్‌’ (ఇంటికొక్కడు) పైరసీని ప్రోత్సహించకండి అంటూ ఆయ‌న విజ్ఞప్తి చేశాడు. ఇంటికొక్క‌రు వ‌చ్చి సినిమా చూడండి కానీ ఇంటికే సినిమా తీసుకెళ్లొద్దు అని కోరుతున్నాడు.థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూద్దాం… మ‌న సినిమాను బ‌తికిద్దాం… క‌ళ‌ను న‌మ్ముకున్న క‌ళాకారుల‌ను బ‌త‌క‌నిద్దాం అంటూ ‘ఆద్య మీడియా’ కోరుతోంది. మీరు స‌హ‌క‌రించండి!

https://www.youtube.com/watch?v=MH62HsNbDtk

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -