Friday, April 26, 2024
- Advertisement -

నన్ను కావాలనే హింసిస్తున్నారు.. కన్నీరు పెట్టుకున్న అచ్చెన్న!

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని బెదిరించాడన్న ఆరోపణలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి కంటతడి పెట్టుకున్నారు. నేడు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అక్కడ అచ్చెన్నాయుడు సతీమణి సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. భారీ బందోబస్తు మధ్య నిమ్మాడలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

తాజాగా ఆయన బెయిల్ పై విడుదలై మీడియా ముందు భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ తనను టార్గెట్ చేసుకొని కావాలనే మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. సంబంధంలేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డికి, వైసీపీకి కింజరాపు కుటుంబం గుదిబండలా తయారైందని వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కార్ కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

1978 నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం తమదని పేర్కొన్న అచ్చెన్నాయుడు, నిమ్మాడ పంచాయతీ ఎప్పుడూ ఏకగ్రీవంగానే కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చూస్తే సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వైసిపి విధ్వంస విధానాలతోనే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో టిడిపి కార్యకర్త కాశీరాం బలవన్మరణానికి పాల్పడ్డారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు.. ఇంకా ఎంతమంది బలహీన వర్గాలవారు బలికావాలని నిలదీశారు. అయినా తన ఫోన్ కాల్ లో బెదిరించినట్లు ఎవరైనా నిరూపించాలని సవాల్ విసురుతున్నా అని పేర్కొన్నారు.

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా నాగ‌చైత‌న్య‌!

విజృంభిస్తున్న విషజ్వరాలు.. ఎందుకంటే అక్కడ..!

అర‌టాకులో భోజ‌నం ఎందుకు మంచిదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -