నారప్ప నుంచి తొలి సింగిల్ వచ్చేసింది..!

విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ నారప్ప. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు, కలై పులి థాను సంయుక్తంగా నిర్మించారు. ఇవాళ ఈ సినిమా నుంచి ‘చలాకీ చిన్నది ‘ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నారప్ప సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా, ఆయన పుట్టిన రోజు సందర్భంగా నారప్ప సినిమా లోని ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

చలాకి చిన్నమ్మి లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలు టాలీవుడ్ లో ఆరేడు ఉన్నాయి. నిన్న సాయంత్రం మణి శర్మ సంగీత దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమా నుంచి ‘ఏయ్ రా రోయ్ ఏయ్ రారోయ్’ అని సాంగ్ అని సాగే హుషారెక్కించే లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు మణిశర్మ సంగీతం అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య నుంచి ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ అతి త్వరలోనే విడుదల కానుంది. రామ్ చరణ్ -పూజ హెగ్డే మధ్య సాగే ఓ పాటని అతిత్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. ఇలా వరుస బెట్టి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న సినిమాల నుంచి వస్తున్న పాటలు దుమ్ము రేపుతున్నాయి.

Also Read

‘ఉస్తాద్’ గా ముందుకొస్తున్న రామ్..!

రాజమౌళిపై రామ్​లక్ష్మణ్​లు సంచలన కామెంట్లు..

సలార్ మూవీలో వాణీ కపూర్..!

Related Articles

Most Populer

Recent Posts