అర్ధరాత్రి 12 గంటలకు విడుదల కానున్న ధనుష్ సినిమా..?

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటించడం వల్ల ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ధనుష్ నటించిన చిత్రం ‘జగమే తందిరమ్’(తెలుగులో ‘జగమే తంత్రం’)​​. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ధనుష్ కెరియర్లో 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ పక్కన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 18న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రాన్ని ఏకంగా 190 దేశాలలో 17 భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Also read:లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ముందు రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ధనుష్ నటించిన ఈ సినిమా మాత్రం ముందు రోజు అర్ధరాత్రి నుంచి కాకుండా శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా మాతృభాష తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, పోలిష్‌, పోర్చుగీస్‌, బ్రెజిలియన్‌, స్పానిష్‌, థాయ్‌, ఇండోనేషియా వంటి తదితర భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.

Also read:మా నాన్నని ఏరా.. ఒరేయ్ అంటా: జబర్దస్త్ నూకరాజు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -