Friday, May 10, 2024
- Advertisement -

చెల్లి అనడానికి సిగ్గులేదా గజల్? నీకసలు మనస్సాక్షి అనేది ఉందా?

- Advertisement -

ఒక మనిషి నైజం గురించి తెలుసుకోవాలంటే వాడి కిందివాళ్ళతో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సమాజానికి శ్రీరంగ నీతులు చెప్తూ చేతల్లో మాత్రం నీచంగా ప్రవర్తించే మనుషుల నైజం అక్కడే తెలిసిపోతుంది. దేశదేశాలు తిరిగి నీతులు చెప్పిన గజల్ శ్రీనివాస్…….ఆయన దగ్గర పనిచేసే ఒక పనిమనిషితో ప్రవర్తించిన విధానం అయితే అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మనిషిగా గజల్ శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు. తనపైన ఆధారపడిన ఒక అభాగ్యురాలితో అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు గజల్ శ్రీనివాస్.గజల్‌ శ్రీనివాస్‌పై కేసులు పెట్టిన మహిళ విషయం పక్కన పెట్టినా తన దగ్గర పనిచేసే పనిమనిషిని గజల్ శ్రీనివాస్ బానిసగా చేసుకున్న వైనం మాత్రం గజల్ శ్రీనివాస్‌లో ఉన్న మృగాడి గురించి స్పష్టంగా చెప్తోంది.

తనపై కేసుపెట్టిన మహిళను సోదరిలా చూసుకున్నానని, నేను ఏ తప్పూ చేయలేదని గజల్ శ్రీనివాస్ చెప్పిన మాటలు జుగుప్స కలిగిస్తున్నాయి. పనిమనిషితో ప్రవర్తించిన విధానంతోనే గజల్ శ్రీనివాస్‌లో అసలు మనిషే లేడు, అతనికి మానవత్వమే లేదు అన్న విషయం తెలుస్తోంది. అలాంటి వ్యక్తి ఆత్మసాక్షి గురించి మాట్లాడడం పతనానికి పరాకాష్ట. ఇక తనపై కేసులు పెట్టిన మహిళను సోదరిలా చూసుకున్నానని గజల్ చెప్పిన మాటలను చూస్తే అతనికి అక్క, చెల్లి, అమ్మలాంటి బంధాలపై కూడా కనీస గౌరవం కూడా లేదన్న విషయం అర్థమవుతోంది. అరెస్ట్ అయ్యే సమయానికి తనలో ఉన్న వికృత రూపాన్ని ప్రపంచానికి చూపించిన వీడియోను గజల్ శ్రీనివాస్ చూసుకున్నాడో లేదో తెలియదు……ఒక వేళ ఆ వీడియోను చూసిన తర్వాత కూడా బాధిత మహిళను సోదరిలా చూసుకున్నాను అని గజల్ చెప్పి ఉంటే మాత్రం గజల్ శ్రీనివాస్‌లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని ఘంటాపథంగా చెప్పొచ్చు.

ఇక ఈ వ్యవహారం మొత్తం కూడా గజల్ శ్రీనివాస్‌పై కుట్రగా కొంతమంది చేస్తున్న వితండ వాదన మాత్రం సమాజం అంటే ప్రేమ ఉన్నవాళ్ళకు ఆవేధన కలిగిస్తోంది. ఆ వీడియో తీసేటప్పుడు గజల్ శ్రీనివాస్‌ని అర్థనగ్నంగా పడుకోమని ఎవరైనా చెప్పారా? పనిమనిషితో దిగజారిపోయి జంతువులా ప్రవర్తించమని ఎవరైనా చెప్పారా? ఒకవేళ ఎవరో అలా చెయ్యమని చెప్తే మాత్రం గజల్ శ్రీనివాస్ ఎందుకు అలా చేశాడు? వీడియోలో సాక్ష్యాలు అంత బలంగా ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు మహిళలు కూడా గజల్ శ్రీనివాస్‌ని సమర్థిస్తూ మాట్లాడడం మాత్రం విస్తుగొలుపుతోంది.

ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ పై స్థాయిలో ఒత్తిళ్ళు మొదలయిపోయే ఉంటాయి. లగడపాటి రాజగోపాల్, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న టిడిపి నాయకులు కూడా మంతనాలు చేస్తూ ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీడియో సాక్ష్యాలతో సహా దొరికిన సందర్భాల్లో కూడా గజల్ శ్రీనివాస్‌లాంటి వాళ్ళను శిక్షించడంలో మన చట్టం విఫలమయితే మాత్రం ఇక ఆ తర్వాత నుంచీ మహిళల రక్షణ గురించి, అత్యాచారాల గురించి మాట్లాడే అర్హత కూడా ఎవరికీ ఉండదు అన్నది కఠిన నిజం. అలాగే ముందు ముందు ప్రతిఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి ఆడవాళ్ళను పూర్తిగా ఇంట్లోనే భద్రంగా దాచుకోవాల్సిన భయానక పరిస్థితులు తయారవుతాయనడంలో సందేహమే లేదు.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -