Wednesday, April 24, 2024
- Advertisement -

ఒకేరోజు తొమ్మిది సినిమాలు విడుద‌ల‌

- Advertisement -
  • చిన్న సినిమాలతో థియేట‌ర్లు ఫుల్‌

సినిమాలు విడుద‌ల లేక సినీ ప‌రిశ్ర‌మ క‌ళ త‌ప్పింది. కొత్త సినిమాలు వ‌చ్చినా ఒక‌టి రెండు వ‌స్తున్నాయి. కానీ థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి క‌నిపించలేదు. అయితే ఈ శుక్ర‌వారం చిన్న సినిమాల‌తో థియేట‌ర్లు నిండిపోయాయి. ఒకేసారి తొమ్మిది సినిమాలు విడుద‌లై సినీ ప‌రిశ్ర‌మ‌కు జోష్ వ‌చ్చింది. మ‌న తెలుగు సినిమాల‌తో పాటు రెండు డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌లయ్యాయి. బిగ్‌బాస్ విజేత, న‌టుడు శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల న‌టించిన స్నేహ‌మేరా జీవితం, కొత్త న‌టీన‌టుల‌తో వ‌చ్చిన లండ‌న్‌బాబులు, ఇక కార్తీ, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ న‌టించిన ఖాకీ, సిద్ధార్ద్, ఆండ్రియా న‌టించిన గృహం సినిమాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. విడుద‌లైన నాలుగు సినిమాలు మంచి టాక్‌ను సంపాదించుకుంటున్నాయి. మిగ‌తా సినిమాలు క‌నిపించ‌డం లేదు.

కొత్త న‌టీన‌టుల‌తో వ‌చ్చిన లండ‌న్‌బాబులు చిత్రం బాగుంద‌ని స‌మాచారం. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన సినిమా ‘అండవన్‌ కట్టలై’ కు రీమేక్ ఈ సినిమా. శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల క‌లిసి న‌టించిన స్నేహ‌మేరా జీవితం కొంచెం నిరాశ‌ప‌రిచే విధంగా ఉంది. సిద్థార్ద్, ఆండ్రియా న‌టించిన హ‌ర్ర‌ర్ సినిమా ‘అవల్‌’ త‌మిళంలో బాగా ఆడింది. ఆ సినిమాను డ‌బ్బింగ్ చేసి గృహం పేరు మీద తెలుగులో విడుద‌ల అయ్యింది. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టిస్తూ థియేట‌ర్‌కు ర‌ప్పిస్తోంది. ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ అనే చిత్రాన్ని ‘ఖాకీ’ పేరుతో తెలుగులో విడుద‌ల చేశారు. ఈ సినిమాలో కార్తీ, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క‌లిసి న‌టించారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

వీటితో పాటు `ఇక ప్రేమతో మీ కార్తీక్, ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం, లవర్స్ క్లబ్, రారా, దేవీ శ్రీ ప్రసాద్` త‌దిత‌ర సినిమాలు విడుద‌ల అయ్యాయి. అయితే ఆ సినిమా బృందం విడుద‌ల అవుతాయ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ సినిమాలు ఏయే థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యాయో లేదో తెలియ‌డం లేదు. కానీ వాటికి అవి స‌రిప‌డా ప్ర‌చారం లేకపోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌క‌పోయి కూడా ఉండ‌వ‌చ్చు. అందుకే ఆ సినిమాలు విడుద‌లైనా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇంకా ఎన్నాళ్లో థియేట‌ర్ల‌పై ప్ర‌ముఖుల పెత్త‌నం అని అభిమానులు, చిన్న సినిమా క‌ళాకారులు ప్ర‌శ్నిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -