Monday, May 6, 2024
- Advertisement -

‘జార్జిరెడ్డి’ మూవీ రివ్యూ

- Advertisement -

చరిత్రలో విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా నిలిచిపోయిన వ్యక్తి జార్జిరెడ్డి. ఆయన జీవితం ఆధారంగా జార్జిరెడ్డి సినిమా తెరకెక్కిండి. జీవన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ పోషించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) చిన్నతనం నుంచే అన్యాయం చూస్తే తట్టుకోలేడు. అలాంటి వ్యక్తి పెద్దయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విప్లవాత్మక విద్యార్థి నాయకుడుగా ఎదుగుతాడు. మాములు స్టూడెంట్ నాయకుడుగా ఎలా మారాడు ? ఆ తర్వాత క్యాంపస్ లో సమస్యలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చేశాడు ? ఈ నేపథ్యంలో ఎలాంటి నాటకీయ పరిణామలు చోటు చేసుకున్నాయి. అవి జార్జికి ఎలాంటి సమస్యలను తీసుకొచ్చాయి ? జార్జిని చంపటానికి ప్రత్యర్థి ముఠాలు ఇలాంటి ప్లాన్స్ వేశాయి ? లాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

జార్జిరెడ్డి పాత్రలో నటించిన సందీప్ మాధవ్.. అద్భుతంగా చేశాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమా కోసం చేసిన ధైర్యంను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అప్పటి కాలం పరిస్థితులను.. రాజకీయాలను.. అర్ధిక పరిస్థితులను ఇలా ప్రతిది చూపించిన విధానం చాలా బాగుంది. జార్జిరెడ్డి ప్రస్థానం తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి. జార్జిరెడ్డిని ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేసే సీన్.. జార్జ్ కి మంచి ఉద్యోగం వచ్చినప్పటికి తన నమ్మిన సిద్దాంతం కోసం ఆ అవకాశాన్ని కూడా వదులుకునే సీన్.. అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక కీలక పాత్రలో కనిపించిన సత్య దేవ్, ‘జార్జి రెడ్డి’ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ మరాఠీ నటి దేవిక తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. బిల్డప్ సిన్స్ ఎక్కువయ్యాయి. ఫస్ట్ ఆఫ్ స్లోగా సాగి కాస్త బోర్ కొట్టిస్తోంది. యాక్షన్ సీన్స్ కోసం సినిమా లెంగ్త్ ని పెంచడం కూడా మైనస్ గా నిలిస్తోది. సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగుతుంది. అయితే దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోయాడు.

మొత్తంగా : ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్, డైలాగ్స్, టేకింగ్, నటీనట్లున నటన.. ముఖ్యంగా సందీప్ మాధవ్ నటన సినిమాలో హైలైట్ గా ఉంటాయి. అయితే సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, క్లారిటీ మిస్ అవ్వడం కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు మైనస్ గా కనిపిస్తాయి. ఏమైన ఈ తరం జార్జిరెడ్డి లాంటి లీడర్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ సినిమా చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -