ఆ హీరోతో నాకు ఎటువంటి గొడ‌వ‌లు లేవంటున్న సాయి ప‌ల్ల‌వి

- Advertisement -

మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సాయిపల్లవి. ఈసినిమా త‌రువాత ఈ అమ్మ‌డు రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది.వ‌ర‌స ఆఫ‌ర్ల‌తో సినిమాలు బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నానితో ఎమ్‌సిఏ సినిమాలో న‌టించి మ‌రో హిట్ కొట్టేసింది.అయితే ఈ సినిమా టైంలో నానికి సాయిప‌ల్ల‌వి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి.ఇక ‘కణం’ సినిమా సమయంలో నాగశౌర్య అయితే సాయి ప‌ల్ల‌విపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

తాజాగా ఈ భామ మ‌రో హీరోతో గొడ‌వ ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.తాజాగా శర్వానంద్ సరసన సాయిపల్లవి ‘పడి పడి లేచే మనసు’ సినిమా చేస్తోంది. సాయిపల్లవి సినిమా షూటింగ్ స‌మ‌యంలో శర్వానంద్‌తో గొడ‌వ ప‌డింద‌ని,దీని కార‌ణంగా ఆమె షూటింగ్ స‌రిగా రావ‌డంలేద‌ని స‌మాచారం.అయితే ఈ శ‌ర్వానంద్‌తో గొడ‌వ‌పై సాయిప‌ల్ల‌వి స్పందించింది.ఇందులో ఎంతమాత్రం నిజం లేదు .. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శర్వానంద్ మరో సినిమా కూడా చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగులో పాల్గొంటున్న కారణంగా ‘పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

- Advertisement -

 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -