Thursday, May 2, 2024
- Advertisement -

పాపం విశాల్‌

- Advertisement -

హీరో విశాల్ తెలుగు వ్య‌క్తి అయిన త‌మిళ సినిమాల్లో రాణించి మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.త‌మిళ చిత్ర మండ‌లి ఎల‌క్ష‌న్‌లో పోటి చేసి ఘ‌న విజ‌యం సాధించాడు.ఇప్పుడు ఎవ్వ‌రి ఊహాల‌కు అంద‌కుండ రాజకీయాల్లోకి వచ్చాడు. తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.నిన్ననే నామినేషన్‌ కూడా దాఖలు చేశాడు. అనూహ్యంగా విశాల్‌ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు.? అన్న అనుమానం అందరిలోనూ కలగడం సహజమే.

విశాల్‌ రాజకీయాల్లోకి రావడానికి ఓ బలమైన కారణం వుందట. అదే, విశాల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో వుండడమట. నిజమేనా.? నిర్మాతగా విశాల్‌ సేఫ్‌ జోన్‌లోనే వున్నాడు. అలాంటి విశాల్‌కి ఆర్థిక ఇబ్బందులంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విశాల్‌ని, శశికళ తరఫున దినకరన్‌ రాజకీయాల్లోకి దించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్త‌న్నాయి.

దినకరన్‌పై కేసులు వుండడంతో, వ్యూహాత్మకంగానే శశికళ వ్యవహరించారనీ, జైల్లోంచే చక్రం తిప్పి, విశాల్‌ని రంగంలోకి దించారనీ ప్రచారం జరుగుతోంది. తమిళ సినీ పరిశ్రమలో పలువురు విశాల్‌కి మద్దతు పలుకుతోంటే, షరామామూలుగానే ఇంకొందరు విశాల్‌ని వ్యతిరేకిస్తున్నారు. విశాల్‌, నడిగర్‌ సంఘానికీ, నిర్మాతల మండలికీ చేసిందేమీ లేదనీ, రాజకీయంగా ఎదిగేందుకు సినీ పరిశ్రమను పావులా వాడుకుంటున్నాడనే ఆరోపణలు తెరపైకొస్తున్నాయి. విశాల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో వున్నమాట వాస్తవమేనన్నది తమిళ సినీ పరిశ్రమలో కొందరి వాదన. విశాల్‌ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.

మొత్తమ్మీద, రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు రావడం.. అదీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికేమీ కాదు. కులం, మతం, ప్రాంతం.. ఇంకా చాలా చాలానే వివాదాలు తెరపైకొస్తుంటాయి. అవన్నీ ఆలోచించకుండానే విశాల్‌ ఎన్నికల బరిలోకి దిగాడని అనుకోలేం. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -