Friday, May 3, 2024
- Advertisement -

‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ!

- Advertisement -

చిత్రం: జాతి రత్నాలు
రేటింగ్: 2.75/5 
తారాగణం: నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, దివ్య స్పందన తదితరులు
సంగీతం: రథన్
ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ
కెమెరా: సిద్ధం మనోహర్
నిర్మాత: నాగ్ అశ్విన్
దర్శకత్వం: అనుదీప్ కె.వి
విడుదల తేదీ: 11 మార్చ్ 2021.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల తర్వాత స్వప్నాసినిమాస్‌ సంస్ధ ముచ్చటగా మూడో చిత్రంగా నిర్మించిందే జాతిరత్నాలు. కొన్ని సినిమాలపై విడుదలకు ముందే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమానే ‘జాతి రత్నాలు’. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి.

కథ :

శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) మెదక్‌ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికి ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు.శ్రీకాంత్‌కి ఓ శారీ, మేచింగ్‌ గాజుల దుకాణం నడుపుతుంటాడు. కానీ అతనికి అది ఇష్టం ఉండదు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్‌ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు.

హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి బయలుదేరుతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్‌ కూడా హైదరాబాద్‌కు వస్తారు. వచ్చాక అసలైన తిప్పలు మొదలవుతాయి ముగ్గురికి. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా ముగ్గురూ ఓ మర్డర్‌ కేసులో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఆ మర్డర్‌ కేసులోనుంచి ఎలా ముగ్గురూ బైటపడతారు అన్నదే కధా సారాంశం.

విశ్లేషణ :
దర్శకుడు అనుదీప్‌ జాతిరత్నాలు చిత్రాన్ని ఫుల్‌ లెంత్ ఎంటర్‌టైనర్‌గానే మలచాలనుకున్న సంకల్పం పూర్తిగా నెరవేరింది. ముగ్గురు అమాయకులు‌.. ఒక సీరియస్‌ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్‌. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు.

అలాగే సెకండాఫ్లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్‌ డైలాగ్స్‌మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్‌ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి సినిమా వినోదాల విందు భోజనంలా, సకుటుంబ సపరివార సమేతంగా చూసే లేదా చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకలను అకట్టుకుంది.

నటీనటులు :
నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలపైనే సినిమా అంతా రన్‌ అవుతుంది. ముగ్గురికి ముగ్గురూ పేరు పెట్టడానికి లేని విధంగా నటించారు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా చిట్టి పాత్రలో క్యూట్‌గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమదైన కామెడీ పంచ్‌లతో నవ్వించారు.

సాంకేతివర్గం :

కెమెరా పనితనం ఓకే. ఎడిటింగ్ మాత్రం చాలా పూర్ గా ఉంది. కొన్ని చోట్ల సీన్ పూర్తవకుండా మధ్యలోనే జంప్ కొట్టినట్టుగా అనిపించింది. సంగీతపరంగా ఓకే. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలు బాగున్నాయి. దర్శకత్వం బాగానే ఉంది.

ప్లస్ పాయింట్స్  : నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన

మైనస్ పాయింట్స్ : కథలో కొత్తదనం లోపించడం

బాటమ్ లైన్ : కడుపుబ్బా నవ్వించిన ‘జాతిరత్నాలు’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -