థియేటర్లలోనే విడుదల కానున్న ‘తలైవి’..!

- Advertisement -

వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. రెండేళ్ల కిందట విడుదలైన మణికర్ణిక సూపర్ హిట్ కావడంతో ఆమె ప్రయోగాలు చేయడం మరింతగా పెంచింది. అదే ఊపులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోఫిక్ ‘తలైవి’లో నటిస్తోంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ కు అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను గత ఏప్రిల్ 23వ తేదీ విడుదల చేయాలని భావించగా, కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘తలైవి’ కూడా ఓటీటీ లో విడుదల అవుతుందని ప్రచారం మొదలైంది. దీనిని తాజాగా మేకర్స్ ఖండించారు.

- Advertisement -

Also Read: తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!

‘తలైవి’ సినిమా నిర్మాణం పూర్తి కాకముందే తమిళ భాషల్లో ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మేకర్స్ ‘తలైవి’ థియేటర్లలో విడుదల అయిన తర్వాతే ఓటీటీ లో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కారణంగానే ‘తలైవి’ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కంగనా రనౌత్ కూడా ‘తలైవి’ థియేటర్లలోనే విడుదలవుతుందని ప్రకటించారు. దీంతో ఈ సినిమా మేకర్స్ కూడా ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఈ సినిమా అన్ని భాషల్లో ఏకకాలంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -