53 సర్జరీలు జరిగాయ్ అంటూ షాక్ ఇచ్చిన కంగనా?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సమాజంలో సమకాలీన అంశాలపై నిత్యం స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. కంగనా రనౌత్ ప్రస్తుతం నటించిన జయలలిత బయోపిక్ “తలైవి” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు కంగనా “తేజస్ ” , “మణికర్ణిక రిటర్న్స్”, “ది లెజెండ్ ఆఫ్ దిద్దా”, “ధాకడ్ “వంటి సినిమాలతో పాటు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బయోపిక్‌ ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది.

కంగనా నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ తన సోదరి రంగోలీకి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓ ఆకతాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. రంగోలీ కాదనడంతో ఆగ్రహానికిలోనైన అతను యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సగానికి పైగా రంగోలీ ముఖం కాలిపోయింది. ఒక కంటి చూపు కోల్పోయింది. అలాగే ఒక చెవి పూర్తిగా కాలిపోయింది. ఛాతిభాగం సైతం బాగా దెబ్బతింది.సుమారు మూడేళ్లలో ఆమెకు 53 సర్జరీలు జరిగాయి. అయినా తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ రంగోలి మానసికంగా కలత చెందుతూ ఎవరితోను మాట్లాడకుండా ఉండేది.

- Advertisement -

Also read:అతను నా ప్రియుడు కాదు.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!

రంగోలిని ఎంతో మంది మానసిక నిపుణులకు చూపించినప్పటికీ సరైన ఫలితం లేకపోయింది.
అలా ఓరోజు రంగోలిని యోగా శిక్షణకు తీసుకెళ్లాను. నాతోపాటు తను కూడా యోగా చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి రంగోలి ప్రవర్తనలు ఎంతో మార్పు వచ్చింది. యోగా వల్ల మానసిక ప్రశాంతత కలిగి అందరితోనూ మాట్లాడటం ప్రారంభించింది. తన ఆరోగ్యం కూడా మెరుగుపడి ప్రస్తుతం సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతుంది. రంగోలి జీవితాన్ని యోగా సమూలంగా మార్చిందని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకుంది.

Also read:అతను ఇచ్చిన రూ.300 ఇంకా నాతోనే ఉన్నాయ్: ప్రియమణి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -