చిరంజీవికే నో చెప్పింది.. మహేష్ బాబు పరిస్థితి ఏమిటో మరి..

- Advertisement -

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసుకున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ జక్కన్న ఎస్ . ఎస్. రాజమౌళితో చేయాల్సి ఉంది. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను సైతం సిద్దం చేశారు. అన్నీ ఓకే అనుకున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. ఆసినిమా విడుదల తర్వాతనే మహేష్ తో సినిమా చేస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. కాగా వీరి కాంబినేషన్ కు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు మహేష్ బాబు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు విజయం సాధించాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఇది మహేష్ బాబుకు 28వ సినిమా అవుతుంది.

- Advertisement -

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ అయిన సోదరి పాత్రలో ప్రముఖ హీరోయిన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారు. ఇందుకోసం సాయి పల్లవిని సంప్రదించారని సమాచారం. బోలా శంకర్ సినిమాలో తనకు సోదరిగా నటించాలని అడిగిన మెగాస్టార్ చిరంజీవికే సాయి పల్లవి నో చెప్పింది. మరి మహేష్ బాబు సరసన సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందా.. సాయి పల్లవి ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: శ్రీదేవి అక్క.. నాకు వరసకు పిన్ని..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -