Saturday, April 27, 2024
- Advertisement -

మహానటి టీజర్……. ఆ ఒక్క విషయంలో మాత్రం వరస్ట్ రెస్పాన్స్ వస్తోంది…… ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అశ్విన్

- Advertisement -

ఎవడే సుబ్రమణ్యం సినిమా చూసినవాళ్ళందరికీ ఆ సినిమా డైరెక్టర్ గుర్తుండిపోతాడు. మరీ ముఖ్యంగా ఆ సినిమాను ఇష్టపడ్డవాళ్ళకు ఆ సినిమా డైరెక్టర్‌పై అభిమానం స్కై హైట్స్‌లో ఉంటుంది. మామూలుగా అయితే కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు మహానటి సావిత్రి జీవితాన్ని ఆవిష్కరిస్తానంటే విమర్శలు కాస్త గట్టిగానే వినిపించి ఉండేవి. కానీ ఎవడే సుబ్రమణ్యం సినిమా తీసిన దర్శకుడు కావడంతో అందరూ కూడా నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని అభినందించారు.

తాజాగా మహానటి టీజర్‌ని రిలీజ్ చేశాడు నాగ్ అశ్విన్. టీజర్ చాలా చాలా బాగుంది. మాయాబజార్ పెట్టెను సింబాలిక్‌గా చూపించడం చాలా బాగుంది. సినిమాను మించిన మాయాబజార్ ఏం ఉంటుంది? అలాగే తెరవెనుక సినిమావాళ్ళ జీవితాలన్నీ మాయాబజార్ సినిమాను మించిన డ్రామాతో ఉంటాయి. ఇక గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక టైటిల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మహానటి అంటూ టీజర్ చివరలో వచ్చిన ఓకల్స్ మాత్రం భయపెట్టేశాయి. రవితేజ తరహా ఊరమాస్ సినిమాలో జంతువులు అరిచినట్టుగా మహానటి అంటూ అరవడం మాత్రం చివుక్కుమనిపించింది. రేపు సినిమాలో ఈ అరుపులు లేకపోతే సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. అలా కాకుండా ‘ఇంద్ర’ లాంటి సినిమాల్లో రెగ్యులర్‌గా టైటిల్ ఓకల్స్ వినిపించినట్టుగా ఈ మహానటి అనే ఓకల్స్ థియేటర్‌లో వినిపిస్తే మాత్రం సెన్సిబుల్ అండ్ హ్యూమన్ టచ్ ఉన్న సినిమా చూద్దామని వచ్చిన జనాలకు పిచ్చెక్కిపోవడం ఖాయం. అయినా సావిత్రి జీవిత కథను పెయింటింగ్‌లా తీస్తున్నాం అని చెప్పినవాళ్ళు ఇలాంటి ఊరమాaస్ అరవ మేళం సింగం స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఓకల్స్ ఉండాలని ఎలా అనిపించిందో? బి అవేర్ అశ్విన్…….ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మహానటి జీవితాన్ని తెరకెక్కిస్తున్నావ్……ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకో. ఆ మహానటి గౌరవానికి భంగం కలిగేలా ఏదీ ఉండకూడదు అని గుర్తుపెట్టుకో. ఇది కేవలం నిన్ను అలర్ట్ చేయడానికే. నీ ప్రతిభపైన అపార నమ్మకంతో………నీపై గౌరవంతో ఇస్తున్న సలహా…….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -