మహేశ్ బాబు సినిమాలో నాని

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ అంటేనే ఆ క్రేజ్ వేరు. అతడు, ఖలేజా తర్వాత ముచ్చట మూడోసారి ఈ ఇద్దరి కాంబోలో మరో మూవీ సిద్ధమవుతోంది. రాధకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్స్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు నేచురుల్ స్టార్ నానిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు నాని సైతం వెంటనే ఒప్పుకున్నాడట. నానితో పాటు మలయాళ నటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో ఏ చిన్న పాత్రనైనా పెద్ద స్టార్స్ తో చేయించడం రివాజు.

అందుకే మాటల మాంత్రికుడి సినిమాలో ఏ రోల్ అయినా చేసేందుకు పెద్ద స్టార్స్ కూడా ముందుకు వస్తుంటారు. మరోవైపు మహేశ్ బాబు నటిస్తున్న 28వ చిత్రం ఇది.

డ్రీమ్ కారు సొంతం చేసుకున్న విశ్వక్ సేన్

మరోసారి కంగన వివాదాస్పద కామెంట్స్

నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Related Articles

Most Populer

Recent Posts