జూలై 30న థియేటర్​లో విడుదలయ్యే సినిమాలివే..!

ఏపీ, తెలంగాణలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. దీంతో కొన్ని చిన్న సినిమాలు విడుదల చేస్తున్నారు. జూలై 30న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలకు వచ్చే స్పందన బట్టి.. కొన్ని పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్రయం, నరసింహాపురం, పరిగెత్తు పరిగెత్తు, తిమ్మరసు, ఇష్క్​ సినిమాలు జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

తిమ్మరసు, ఇష్క్​ సినిమాలకు మినహా మిగతా సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు జరగలేదు. దీంతో వాటిపై ఎవరికీ అంచనాలు లేవు. ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తిమ్మరసు చిత్రంపై అంచనాలు ఉన్నాయి. సత్యదేవ్​ ఇప్పటికే ఓటీటీలో మంచి గుర్తింపు పొందాడు. ఇక నటుడిగానూ నిరూపించుకున్నాడు. అతడి సినిమాలన్నీ విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్నాయి.

ఇక తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్​ వారియర్​ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఇష్క్​ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా.. ఓ బేబీ, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. మరోవైపు ప్రియా ప్రకాశ్​ వారియర్​ కూడా కన్ను గీటి దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నది. అయితే ఇష్క్​, తిమ్మరసు చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. వీటి ఫలితాలను బట్టి.. థియేటర్​లో పెద్ద సినిమాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Related Articles

Most Populer

Recent Posts