Friday, May 3, 2024
- Advertisement -

ఎం ఎస్ ధోనీ రివ్వూ

- Advertisement -

సచిన్ టెండూల్కర్ తరవాత భారతీయ క్రికెట్ చరిత్ర లో అంతటి ఘన చరిత ని సాధించిన ఒకే ఒక్క ధీరుడు ఎం ఎస్ ధోనీ .. అతని కథని తెరమీద చిత్రీకరించి చూపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో ఝార్ఖండ్ లో పుట్టి దేశ క్రికెట్ ని శాసించే స్థాయి ఆటగాడుగా ఎదిగిన ధోనీ క్రమాన్ని ఒక బయో పిక్ గా తీయాలి అని నీరజ్ పాండే అనుకున్నప్పుడు చాలా రిస్క్ అని అందరూ అన్నారు.

ఇన్ని సంవత్సరాల పాటు బెస్ట్ ఫినిషర్ గా మనందరికీ తెలిసిన ధోనీ బెస్ట్ స్టార్టర్ గా ఎలా ఎదిగాడో చూద్దాం ..

స్టొరీ – పాజిటివ్ లు : ఝార్ఖండ్ లాంటి మారుమూల ప్రదేశం లో అత్యుత్తమ టాలెంట్ కలిగిన కుర్రాడిగా ఎదుగుతాడు ధోనీ. క్రికెట్ లో మెళకువలు నేర్పే కోచ్, సపోర్ట్ ఇచ్చే టీచర్ లు ఉండడం ధోనీ జీవితానికి పెద్ద పాజిటివ్ పాయింట్ గా మారుతుంది. క్రమక్రమంగా తన తండ్రికి ఇష్టం లేకపోయినా ఒక గొప్ప క్రికెటర్ గ ఎదగాలి అనే దృష్టిలో వెళుతున్న ధోనీ కి ఎలాంటి అవాంతరాలు ఎదురు అయ్యాయి, అవన్నీ దాటికుని తన క్రికెట్ నీ తన ప్రేమనీ రెండింటినీ ఎలా మ్యానేజ్ చేసుకుని సాధించుకున్నాడు అనేది డైరెక్టర్ ఈ సినిమాలో గొప్పగా చూపించాడు. హీరో క్యారెక్టర్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయాడు అంటే ఆ ప్లేస్ లో ధోనీ ఉన్నా అంతగా కనక్ట్ అవ్వలేము ఏమో అన్నట్టు చేసాడు అతను. ధోనీ ఆహార్యం నుంచి హావ భావాల వరకూ పెర్ఫెక్ట్ గా ఉన్నాడు మనోడు. డైరెక్టర్ నీరజ్ పాండే ఈ సినిమాలో ధోనీకి సంబంధించిన ప్రతీ సీక్రెట్ నీ అతని జీవితంలోని ప్రతీ అంశాన్నీ టచ్ చేసుకుంటూ రావడంతో సినిమా రక్తి కట్టింది. ఈ ఒక్క విషయమే ధోనీ ఫాన్స్ కి సినిమా తప్పనిసరిగా చూడాలి అనే కారణాన్ని ఇస్తుంది. ఇతర పాత్రలలో అనుపం ఖేర్ పరవాలేదు అనిపించాడు. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ గా నిలవగా క్లైమాక్స్ మరింత అద్భుతంగా తీసాడు నీరజ్. 

నెగెటివ్ లు – లీడ్ పైర్ మధ్యన కెమిస్ట్రీ సరిగ్గా వర్క్ అవ్వలేదు, మరొక పక్క సరైన సీన్ లు పెట్టకుండా ధోనీ లవ్ స్టోరీ నీ – పెళ్లి కథనీ డ్రమాటిక్ గా చూపించడం లో డైరెక్టర్ చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. సినిమాని చాలా మటుకూ బయో పిక్ లాగా కాకుండా ఎక్కువశాతం డ్రామా పెట్టడం పెద్ద నెగెటివ్ అని చెప్పాలి. ఇదే కొన్ని చోట్ల పాజిటివ్ అవ్వగా మరికొన్న చోట్ల బెడిసి కొట్టింది. నీరజ్ పాండే డైరెక్షన్ లో పెద్ద ఇబ్బందులు లేవు గానీ వీఎఫ్ఎక్స్ ల విషయం లో డైరెక్టర్ పూర్తిగా దెబ్బతిన్నాడు. ఆ క్వాలిటీ అస్సలు బాలేక ఇబ్బంది అనిపిస్తుంది. పైగా సినిమా చాలా లేన్తీ గా తీసారు, లవ్ ట్రాక్ లు అయితే ఖచ్చితంగా విసుగు పుట్టిస్తాయి. సుశాంత్ లాంటి యాక్టర్ ని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా లవ్ ట్రాక్ భారీగా ఉండాలి అనుకున్నారో ఏమో అనవశ్రామైన మేరకు సినిమాని సాగాతీసింది ఈ ట్రాక్ . పాటలు – బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుండాల్సింది .

మొత్తంగా :

మొత్తంగా చూస్తే ఒక గొప్ప ఆటగాడి జీవితాన్ని తెరమీద ఆవిష్కరించడం లో నీరజ్ పాండే సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. అతని థాట్ ని తెరమీద అత్యంత గొప్పగా ఆవిష్కరించగలిగాడు నీరజ్. ధోనీ కూడా సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం తో ఫ్రీడం తో సినిమాని తీసినట్టు అనిపించింది. అక్కడక్కడా ల్యాగ్ లు, స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవ్వకపోయినా బాలీవుడ్ లో వచ్చిన మంచి బయో పిక్ లలో ధోనీ సినిమా ఉండి తీరుతుంది అని చెప్పాలి. కుటుంబం యావత్తూ చూడదగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందికర సీన్ లు లేకుండా జాగ్రత్త పడ్డారు. మంచి ఓపెనింగ్ తో పాటు అదిరిపోయే కలక్షన్ లకి ధోనీ భీజం వేసాడు అన్నమాట.

Related

  1. ధోనీ కి రామ్ చరణ్ కి సంబంధం ఏంటి?
  2. సుమ – ధోనీ సంభాషణ అదరహో
  3. సురేష్ రైనా గా షాక్ ఇవ్వబోతున్న రామ్ చరణ్
  4. ధోని కోసం రాజమౌళి వస్తున్నాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -