సాయిపల్లవిని లేపుకెళ్తున్న చైతూ..

- Advertisement -

నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ. ‘ఫిదా’వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, ఏయ్ పిల్లా పరుగున పోదామా’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేసారు. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

కెరీర్‌ పరంగా గొప్పగా ఎదగాలనుకునే యువ జంట మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ ‘లవ్‌ స్టోరీ’అని టీజర్‌ బట్టి అర్థమవుతుంది. ఇంజనీరింగ్‌ చదివి సాఫ్టవేర్‌ జాబ్‌ కోసం ఎదురుచూస్తు విసిగిపోయిన పాత్రలో సాయిపల్లవి కనిపించింది.

- Advertisement -

’జీరో కెళ్లి వచ్చానా సార్.. శానా కష్టపడతా సార్.. మంచి ప్లాన్ ఉంది‘ అంటూ ఉద్యోగం కోసే పాటు పడే రేవంత అనే యువకుడుగా నాగ చైతన్య.. మరోవైపు జాబ్ గ్యారంటీ వస్తుందనుకున్న ఓ మౌనిక అనే అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. టీజర్‌లో నాగ చైతన్య .. ఆ సాఫ్ట్ వేర్ జాబ్ ఏం చేస్తావ్.. కళ్లాద్దాలు వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది.. జుట్టు మొత్తం ఊశిపోతుంది అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. చైతన్య, సాయిపల్లవి లక్స్‌ మిడిల్‌ క్లాస్‌ ని తలపిస్తున్నాయి. . ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ‌యాని, రాజీవ్ క‌న‌కాల‌, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

నాని ‘టక్ జగదీష్’ లేటెస్ట్ అప్ డేట్!

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌

ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...