నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

- Advertisement -

అక్కినేని నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు జంటగా న‌టించిన సినిమా ల‌వ్ స్టోరీ. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ సినీ ప్రియుల‌ను ఎంత‌గానో అలరిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా నాగ్ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విల ‘నీ చిత్తం చూసి..’ లిరిక‌ల్ సాంగ్‌తో పాటు ‘సారంగ ద‌రియా’ సాంగ్ నెట్టింట్లో దుమ్ము రేపుతున్నాయి.

దీనికి తోడు ఈ సినిమాను తెర‌కెక్కించింది విలక్ష‌ణ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న సినిమాలంటేనే మంచి అనుభూతిని క‌లిగించేవిగా ఉంటాయి. దీంతో ‘లవ్ స్టోరీ’పై భారీ అంచానాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -

ఎందుకంటే ఈ చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదివ‌రకే ఈ సినిమాను ఉగాది పండుగ కానుక‌గా 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ద‌ర్శ‌క నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ కొత్త డేట్ ను చెబుతామ‌ని తెలిపారు.

79 వేల మంది చిన్నారులకు కరోనా

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా

ఢిల్లీని వీడుతున్న ప్ర‌జ‌లు.. ఎందుకంటే..?

పవర్ స్టార్ కొత్త సినిమా పేరు ఇదే !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -