Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్, చరణ్, పవన్‌ల ‘అభిమాన డ్రామా’ల అసలు రంగు బయటపెట్టేసిన నానీ

- Advertisement -

హాలీవుడ్‌, బాలీవుడ్‌తో సహా చాలా సినిమా ఇండస్ట్రీలలో లేని ఒక జాఢ్యం తెలుగునాట ఒకటి ఉంది. అభిమానుల చుట్టూ నడిచే డ్రామాలు మామూలుగా ఉండవు. హీరోలు కూడా ఆ అభిమానుల డ్రామాలను పిచ్చి పిచ్చిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అభిమాన మూర్ఖులు ఎక్కువమంది కావాలేమో తెలియదు. కుటుంబాల కంటే అభిమానులే ముఖ్యమంటారు….ఏదైనా అభిమానుల తర్వాతే అంటారు……వాళ్ళు అభిమానులు కాదు…నా ఆత్మీయులు అని అంటారు….వాళ్ళను అభిమానులు అని పిలవడం నాకు ఇష్టం లేదు……నా సోదరులు, ఆత్మీయులు అని చెప్పి డ్రామా రక్తికట్టిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి స్టార్ హీరోలందరూ సినిమాల్లో తక్కువ నటిస్తూ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్‌లో ఎక్కువ నటించస్తూ ఉన్నారు. టాలెంట్‌తో గొప్ప సినిమాలు అందించడం, కష్టపడి క్వాలిటీ సిినిమాలు తెరకెక్కించడం మానేసి అభిమానధనాన్ని క్యాష్‌గా మార్చుకోవడానికి ఛీప్‌గా సినిమాలు తీసేస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. నిజానికి ఆడియో రిలీజ్, ప్రెస్ మీట్స్‌లో అభిమానుల గురించి మన హీరోలు మాట్లాడే ఏ ఒక్క మాట కూడా నిజం కాదన్నది నిఖార్సయిన నిజం. ఆ విషయం చెప్పడానికి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ‘కుటుంబం కంటే అభిమానులే ఎక్కువ, వాళ్ళు నాకు ఆత్మీయులు’ అని స్టార్ హీరో మాట్లాడిన మాటలకు రెచ్చిపోయి పూనకం వచ్చినట్టుగా ఊగిపోయే అభిమానులు……ఆ ఫంక్షన్ అయిన తర్వాత ఆ స్టార్ హీరోని కలవడానికి కోట్ల రూపాయలతో సదరు హీరోగారు కట్టుకున్న రాజమహల్ లాంటి ఇంటి దగ్గరకు వెళ్ళమనండి. ‘నేను ఆ స్టార్ హీరో అభిమానిని.. ఒకసారి కలవాలి’ అని చెప్పి అడగమనండి. ఆ స్టార్ హీరో మాట్లాడడం, చూడడం తర్వాత…….ఆ స్టార్ హిరో ఇంటి మనుషులను కూడా కలవలేడు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డే గెంటేస్తాడు. ఇంకా ఎక్స్‌ట్రాలు చేస్తే పిచ్చికొట్టుడు కొట్టి పోలీస్ కేసు పెట్టి మూసేయించేస్తాడు. ఆ విషయం సదరు అభిమానులకు కూడా తెలుసు. కానీ అభిమాన మైకంలో నుంచి ఆ అభిమానులు బయటపడకుండా ఆ స్టార్ హీరోలు ఒక ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారు. సిినిమాకు దాదాపుగా పది, పదిహేను కోట్లు తీసుకునే హీరోలు…..సంవత్సరానికి ఒకసారి ఒక్క అభిమానికి ఓ రెండు మూడు లక్షలు దానం చేస్తారు. అలాగే ఓ ఇద్దరు ముగ్గురు అభిమానులను ఆదుకుంటారు…అభిమానులకు ఏం జరిగినా నా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటా అనే స్థాయిలో ఆ తర్వాత ఆ స్టార్ హీరోగారు మాట్లాడతారు……ఇక ఆ విషయం అన్ని మీడియా సంస్థల్లోనూ వచ్చేలాగా లక్షల లక్షలు ఖర్చుపెట్టి ప్రచారం చేయించుకుంటారు……ఆ దెబ్బతో అభిమాన మూఢులు అందరూ మరోసారి మైకంలో పడి జై కొడుతూ ఉంటారు.

ఇప్పుడు ఈ అభిమాన డ్రామాలను నిజాయితీగా విశ్లేషించాడు హీరో నానీ. ‘కమల్ హాసన్ సిినిమాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ఆయన నటించిన స్వాతిముత్యం, సాగరసంగమం, భారతీయుడు, మహానది లాంటి సినిమాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ఇప్పుడు ఆ కమల్ హాసన్ నా దగ్గరకొచ్చి ‘నువ్వు నా అభిమానివి……నీ కోసం నేను ఏం చేయమంటావు’ అని అడిగితే ఎలా ఉంటుంది? ఆ పద్ధతే సరైంది కాదు. ఇది ఎక్కడో ఒక చోట ఆగాలి. అంతే కాదు భయపడుతూ అభిమానుల కోసం అది చేశాం. ఇది చేశాం అని చెప్పొద్దు అని చాలా సీరియస్‌గా మంచి విషయం చెప్పాడు నానీ. నానీ మాటలు నిజాయితీగా ఉన్నాయి. ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. టెంపర్ సిినిమాకు ముందు వరకూ ఎన్టీఆర్ అభిమానుల కోసమని చెప్పి ఎన్ని రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు చేశాడో చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ కూడా బ్రూస్ లీ వరకూ అవే మాటలు చెప్పి రొటీన్ సినిమాలు చేసి విసిగించాడు. బ్రూస్ లీ రిజల్ట్ దెబ్బకు భయపడి ధృవ లాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ మారలేదు. అభిమానం పేరు చెప్పి పవన్ అభిమానులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కూడా ఆ రచ్చన ఆపే ప్రయత్నం అస్సలు చేయడం లేదు. ఆ అభిమానుల కోసం అని చెప్పి సర్దార్, కాటమరాయుడు లాంటి పాత కాలం నాటి సినిమాలు, చీప్ సీన్స్‌తో చుట్టేసిన సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కూడా హింసిస్తున్నాడు. ఇప్పుడు నానీ మాట్లాడిన మాటల తర్వాత అయినా మన హీరోలు మారతారేమో చూడాలి. పవన్ నటించిన తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, ఖుషీ, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు చూసి అభిమానులు అయిన వాళ్ళకు కాటమరాయుడు, సర్దార్‌లాంటి సిిినిమాలు నచ్చుతాయా? కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం డబ్బుల కోసమే ఆ సినిమాలకు కమిట్ అయ్యి సిినిమాకు ముప్ఫై కోట్ల వరకూ వెనకేసుకుని…ఆ చెత్త సిినిమాలు తీయడానికి కారణం అభిమానుల కోరుకోవడమే అని నెపం వాళ్ళపై వేశాడు. ఈ అభిమాన డ్రామాలే ఇప్పుడు విరక్తిపుట్టిస్తున్నాయి. ఇకపైన అయినా మన హీరోలు వాళ్ళ స్వార్థం కోసం అభిమానుల పేరు చెప్పడం, కొత్త సినిమాలు, మంచి సినిమాలు చేయడం చేతకాక అభిమానుల కోసం అని చెప్పడం మానేస్తే బెటరేమో.

నిజాయితీగా ఆలోచించండి. ఒకరి పనిని చూసి మనం అభిమానులం అయ్యామంటే…….మనం అభిమానించే వాళ్ళు ఆ పనిని ఇంకా గొప్పగా చేస్తూ ఉండాలి. అంతేకానీ అభిమానించేవాళ్ళ కోసం అని చెప్పి చెత్తగా పనిచే్స్తూ ఉంటే ఎలా ఉంటుంది? కనీసం డబ్బుల కోసం కమర్షియల్ సిినిమాలు చుట్టేశాం అన్నా అదొక అర్థం. అంతేగానీ వాళ్ళు చేసే చెత్త సినిమాలకు కారణం అభిమానులే అన్న అర్థం వచ్చే స్టార్ హీరోలు మాట్లాడడం మాత్రం దారుణం. అభిమానించిన వాళ్ళను తక్కువ చేయడం, అవమానించడం కాదా ఇది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -