Saturday, April 27, 2024
- Advertisement -

మ‌హ‌నాయ‌కుడును ఫ్రీగా చూడ‌మ‌న్న ఎవ‌రు చూడటం లేదా…?

- Advertisement -

ఎన్టీఆర్ జీవితం వెండితెర మీద అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఆయన త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ రెండు భాగాలుగా తెర‌కెక్కించారు. సంక్రాంతికి విడుద‌లైన మొద‌టి పార్ట్ క‌థాన‌యకుడు ఫ్లాప్‌గా నిల‌వ‌గా , రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడు గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది. మ‌హ‌నాకుడుతో పోలిస్తే క‌థానాయ‌కుడే కాస్తా బెట‌ర్ కలెక్ష‌న్లు సాధించింది. మొద‌టి పార్ట్ ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో రెండో పార్ట్‌పై ఎవ్వ‌రికి పెద్ద‌గా ఆస‌క్తి లేకుండా పోయింది. ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని సినిమా విశ్లేష‌కులు తెలుపుతున్నారు.

తాజాగా ఈ సినిమాను ఫ్రీగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర సినిమా కూడా కొన్ని ఏరియాల‌లో ఫ్రీగా ప్ర‌ద‌ర్శించారు. అందుచేత ఈ సినిమాను కూడా ఫ్రీగా చూపించాల‌ని భావిస్తున్నార‌ట చిత్ర యూనిట్‌. యాత్ర సినిమా అంటే త‌క్కువ బడ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా. పైగా ఈ సినిమా మంచి విజ‌యాన్ని కూడా సొంతం చేసుకుంది. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని ఏరియాల‌లో ఇప్ప‌టికి సినిమా కొన్ని థియోట‌ర్లలో సంద‌డి చేస్తుంది. మ‌రి ఆ సినిమాతో పోలిక పెట్టుకుంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు బ‌య్య‌ర్లు. మ‌హ‌నాయ‌కుడు భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించారు. కాబ‌ట్టి సినిమాను ఫ్రీగా చూపించ‌డం క‌ష్టం అని తెల్చేశారు బ‌య్య‌ర్లు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌ల్ల చాలా న‌ష్టపోయామ‌ని వారు వాపోతున్నార‌ట‌. ఇదే స‌మ‌యంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చార‌ట ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఎన్టీఆర్ సొంత జిల్లాలో ఈ సినిమాను ఫ్రీగా చూపించాలని ఫిక్స్ అయ్యార‌ట చంద్ర‌బాబు.

అవ‌స‌రం అయితే పార్టీ నాయ‌కుల చేత టికెట్లు కొనుగొలు చేయించి , సినిమాను ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా చూపించాల‌ని పిలుపునిచ్చార‌ట చంద్ర‌బాబు. చంద్రబాబు అలా చెప్పారో లేదో పార్టీ నాయ‌కులు టికెట్లు ఫ్రీగా ఇప్పించ‌డానికి పోటీ ప‌డ్డార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో బాబుగారి ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాడానికి నాయ‌కులు తెగ ఆరాట‌ప‌డిపోతున్నార‌ట‌. నాయ‌కులు ప‌రిస్థితి ఇలా ఉంటే , సినిమాను ఫ్రీగా అయిన చూడ‌టానికి కూడా ఎవ‌రు రావ‌డం లేద‌ట‌. సినిమా బాలేద‌ని టాక్ వ‌చ్చిన‌ప్పుడు ,సినిమాను చూడ‌టం ఎందుకు టైం వేస్ట్ అని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతున్నార‌ట‌. దీంతో ఎన్టీఆర్ సినిమాను ఫ్రీగా చూపిస్తామ‌న్న చూసేవారు క‌రువైయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -