మాస్ లుక్‌లో యంగ్ టైగర్

యశ్ హీరోగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. భారతీయ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్‌ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతుండటంతో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్‌కు ఇది 31వ మూవీ. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించి షేర్ చేసిన ఫోటో ఆకట్టుకుంటోంది. గడ్డం, మీసంతో మాస్ గెటప్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడు. తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తైన తర్వాత నీల్‌, ఎన్టీఆర్ కాంబోలో చిత్రం పట్టాలెక్కనుంది. కేజీఎఫ్‌తో బాక్సాఫీస్ షేక్ చేసిన నీల్.. ఆర్ఆర్ఆర్‌తో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్..కలిస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఆ హీరోతో సమంత లిప్ లాక్ సీన్

మహేశ్ బాబు సినిమాలో నాని

ప్రభాస్ మూవీలో కియారా..?

Related Articles

Most Populer

Recent Posts