మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా కేటగిరీలో నిర్మితమవుతున్న ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైనట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమె ప్లేస్ లో పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబినేషన్లో ఇది వరకే అరవింద సమేత వీర రాఘవ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ హిట్ పెయిర్ కొరటాల శివ సినిమాతో జోడీ కడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోయినప్పటికీ ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Also Read: డైరెక్టర్ గా స్టార్ కమెడియన్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -