Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అనుకోవడం లేదు: ఆర్జీవీ

- Advertisement -

కొంతకాలంగా ట్విటర్ వేదికగా మాటల యుద్ధానికి తెరదించుతూ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. వీరిరువురు ఏపీ సచివాలయంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు.

టికెట్ రేట్ల విషయంలో ఎవరితోనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని మంత్రి చెప్పారు. ఎవరినీ ఇబ్భంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే టికెట్ ధరను నిర్ణయించామని స్సప్టం చేశారు. భారీ బడ్జెట్ సినిమాలు ప్రస్తుత కరోనా సమయంలో వాయిదా వేసుకోవాలని సూచించారు.

‘‘మంత్రి పేర్నినానితో చర్చలు సంతృప్తిగా జరిగాయి. సినిమా టిక్కెట్ల రేట్లపై నా అభిప్రాయాన్ని బలంగా వినిపించాను. త్వరలోనే సమస్యకు పరిష్కారం వస్తుంధి. టికెట్ రేట్ల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుంది. సినిమా తీసిన నిర్మాతకే ధరను నిర్ణయించే అధికారం ఉండాలి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇదంతా ప్రభుత్వం చేస్తుందని అనుకోవడం లేదు. నేను ఒక సినిమా నిర్మాతగా మాత్రమే నాని గారితో మాట్లాడాను’’ అని వర్మ అన్నారు.

గతంలో ట్విట్టర్ లో పెట్టిన ప్రశ్నలే మంత్రి పేర్ని నాని దగ్గర చెప్పానని, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే శక్తి నాకు లేదని చెప్పారు. మంత్రి పేర్ని నానితో సమావేశంపై వందశాతం సంతృప్తిగా ఉన్నానని వర్మ తెలిపారు.

కరోనా వచ్చిందా అయితే చావు దరిద్రం పోతుంది.. సెలబ్రిటీ షాక్

క్రేజ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలంటున్న బాలయ్య

ఆంధ్రప్రదేశ్ లో రాత్రి పూట కర్ఫ్యూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -