Friday, May 10, 2024
- Advertisement -

సినీ పందెం కోళ్లు సిద్ధం

- Advertisement -
  • బ‌రిలోకి ప‌వ‌న్‌, బాలకృష్ణ‌, రాజ్ త‌రుణ్‌, సూర్య

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంక్రాంతి నిజంగంటే పండుగ‌నే. ఈ సీజ‌న్‌కు పెద్ద పెద్ద హీరోలు థియేట‌ర్ల‌పై వాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు. ఆ విధంగానే సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కులు, అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతూ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఫుల్ జోష్ ఇచ్చే సీజన్ ఇది. సంక్రాంతి పండుగ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి ఓపెనింగ్స్ ఇస్తాయి. ఈ స‌మ‌యంలో వ‌చ్చే సినిమాల‌న్నీ మంచి హిట్‌నందుకుంటాయి. ఆ విధంగా గ‌త సంక్రాంతికి చిరంజీవి, బాల‌కృష్ణ‌, శ‌ర్వానంద్‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌మ సినిమాల‌తో వ‌చ్చి హిట్లు అందుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ నాలుగు సినిమాలు సంక్రాంతి బ‌రిలో దిగుతున్నాయి.

ప‌వ‌న్ పంజా..
కాట‌మ‌రాయుడు ప‌రాజ‌యంతో ఎల‌గైనా విజ‌యం అందుకోవాల‌ని పవన్‌కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’గా జ‌న‌వ‌రి 10వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాడు. త‌న స్నేహితుడు, త‌న‌కు హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో దర్శకత్వంలో తీసిన సినిమా ఇప్పటికే సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. విడుద‌లైన పాటలు ఆక‌ట్టుకుంటున్నాయి. త్వరలోనే ట్రైలర్‌నీ విడుదల చేయ‌నున్నారు. పవన్‌ – త్రివిక్రమ్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. దానిక‌నుగుణంగా ఏర్పాట్లు, కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ‌కు రెండు రోజులు ముందుగా రావ‌డం ‘అజ్ఞాతవాసి’కి కలిసొచ్చే విషయం.

మ‌రోసారి బాల‌య్య‌..
సంక్రాంతి పండుగ‌కు నందమూరి బాలకృష్ణ రావ‌డం ప‌రిపాటి. ఆయ‌న రావ‌డంతోనే సంక్రాంతి సీజన్‌కు హైప్ తీసుకువ‌స్తాడు. గ‌త సంక్రాంతికి బాగా హైప్ తెచ్చి సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏం జ‌రుగుతోంద‌న‌న్న ప‌రిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్నారు. ‘డిక్టేటర్‌’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ల‌తో గ‌త సంక్రాంతిల‌కు వ‌చ్చాడు. వరుసగా మూడోసారి ‘జై సింహా’తో బాల‌కృష్ణ వ‌స్తున్నాడు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నయనతారకు జోడిగా బాల‌కృష్ణ వ‌చ్చేస్తున్నాడు. బాలయ్య డైలాగులు, ఆయన యాక్ష‌న్ ప్రేక్ష‌కుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్‌ బాలయ్యకు కలిసొచ్చే అంశం. ఈ సినిమా విజ‌యం పొందే అవ‌కాశం ఉంది.

కుర్ర న‌టుడు..
అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో ప‌రిచ‌య‌మైన కుర్ర న‌టుడు రాజ్ త‌రుణ్‌. త‌న‌కు అరంగేట్రం ఇచ్చిన సంస్థ‌లోనే రాజ్ త‌రుణ్ చేస్తున్న సినిమా ‘రంగుల రాట్నం’. కుర్ర న‌టుడు కూడా సంక్రాంతికి వ‌స్తున్నాడు. శ్రీరంజ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా నటించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 14వ తేదీన వ‌స్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో కొంచెం అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పైగా స‌రైన విజ‌యాలు లేక బాధ‌ప‌డుతున్న రాజ్‌త‌రుణ్‌కు ఈ కాంపిటీష‌న్‌తోనైనా విజ‌యం ద‌క్కే అవ‌కాశం ఉంది. గ‌తేడాది శ‌ర్వానంద్ మాదిరి రాజ్‌ తరుణ్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పెద్ద హీరోల ముందు తన సినిమా విడుద‌ల చేసుకుంటున్నాడు.

సూర్య వ‌స్తున్నాడు..
పై మూడు చిత్రాలతో పాటు ఓ అనువాద చిత్రం కూడా సంక్రాంతికి వ‌స్తోంది. సూర్య న‌టించిన‌ ‘గ్యాంగ్‌’ డ‌బ్బింగ్ సినిమాగా సంక్రాంతికి వ‌స్తున్నాడు. త‌మిళ న‌టుడైన సూర్యకు తెలుగు మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’కి రీమేక్ సినిమా ఇది. కీర్తి సురేశ్‌తో న‌టించిన సూర్య జ‌న‌వ‌రి 12వ తేదీన వ‌స్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌డంతో కొన్ని అంచ‌నాలు ఈ సినిమాపై ఉన్నాయి.

ప్ర‌తి సంక్రాంతి పండుగ‌కు తెలుగు చిత్ర సీమ నిండుగా క‌నిపిస్తుంటుంది. థియేట‌ర్లు పెద్ద హీరోల‌తో నిండిపోయి హౌజ్ ఫుల్ బోర్డులు వెక్కిరిస్తుంటాయి. అదే మాదిరి ఈ సంక్రాంతికి ప‌రిస్థితి ఉంది. పండుగ నాలుగు రోజులూ.. థియేటర్‌లో కొత్త సినిమాలు వ‌స్తున్నాయి. సంక్రాంతి పండుగ‌తో దాదాపుగా రూ.200 కోట్ల మార్కెట్‌ జరగబోతోందని అంచ‌నాలు ఉన్నాయి. నాలుగు సినిమాలూ హిట్ టాక్ సొంతం చేసుకుంటే వ‌సూళ్లు ఇంకా పెరగనున్నాయి.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -