సినిమా చేయాలంటే.. ఓ కండీషన్ పెట్టిన మహేశ్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు జోరు పెంచారు. సర్కారు వారి పాట మూవీ హిట్‌తో ఊపుమీద ఉన్న మహేశ్.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు రెండు మూవీస్.. దర్శక దీరులతోనే చేస్తుండటం విశేషం. ఒక మూవీ త్రివిక్రమ్‌తో కాగా మరొకటి రాజమౌళితో మహేశ్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత మహేశ్‌తో రాజమౌళి సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా తెరపైకి వెళ్లేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు సినిమాకు సంబంధించి మహేశ్‌బాబు ఓ కండీషన్ పెట్టాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తన పక్కన బాలీవుడ్ హీరోయిన్‌ వద్దనీ, టాలీవుడ్ హీరోయిన్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని మహేశ్ సూచించాడట.

- Advertisement -

ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పని చేసిన మహేశ్ వారి తీరుతో విసిగిపోయినట్లు తెలుస్తోంది. కాల్షీట్ల విషయంలో ఇబ్బందిపెట్టడం, సౌకర్యాలు ఇతరత్రా విషయాల్లో డిమాండ్లు చేయడంతో విసిగిపోయిన మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. మరి మహేశ్ చెప్పినదానికి రాజమౌళీ ఓకే అంటారో.. లేక సూపర్‌ స్టార్‌నే ఒప్పిస్తారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -