‘అన్నాత్తే’ కోసం మళ్లీ హైదరాాబాద్ కి వచ్చిన రజినీకాంత్

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ మద్య హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. దాంతో షూటింగ్ మద్యలోనే ఆపి చెన్నై బయలు దేరారు. ఈ మద్యలో మళ్లీ కరోనా విజృంభణ మొదలు కావడం.. తమిళనాడు లో ఎన్నికల హడావుడి మొదలు కావడంతో ఐదు నెలలు గ్యాప్ తీసుకున్నారు.

తమిళనాడులో ఎన్నికల హడావుడి ముగియడంతో ఆయన నిన్న ప్రత్యేక విమానంలో బయలుదేరి సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు తమిళనాట వైరల్ అయ్యాయి. అన్నాత్తే షూటింగ్ ఇప్పటికే 75 శాతం వరకూ పూర్తి కాగా, మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేందుకు రజనీకాంత్ హైదరాబాద్ కు వచ్చేశారు.

- Advertisement -

సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ వంటి స్టార్స్ నటిస్తున్నారు. స్టూడియోల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న రజనీకాంత్ చెన్నై నుంచి బయలుదేరగా, ఎయిర్ పోర్టు వద్ద తన కోసం వచ్చిన అభిమానులకు ఆయన అభివాదం పలికి బయలుదేరారు.

ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !

నేటి పంచాంగం, శుక్రవారం (9-4-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -